Nagarjuna Thanks YS Jagan : ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కింగ్ నాగార్జున థాంక్స్ చెప్పారు. జ‌గ‌న్‌తో మీటింగ్ చిరంజీవితో మాట్లాడానని అన్నారు. ఆయన ఏం చెప్పారంటే...

Continues below advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు ముందు ఉన్నాయని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు. మంగళవారం రాత్రి రాజమండ్రిలో నిర్వహించిన 'బంగార్రాజు' సక్సెస్ మీట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఆయన థాంక్స్ చెప్పారు. ఇటీవల సీయంను మెగాస్టార్ చిరంజీవి కలిసిన సంగతి తెలిసిందే. స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చే ముందు జ‌గ‌న్‌తో మీటింగ్‌ చిరంజీవిని అడిగానని నాగార్జున తెలిపారు.
ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని చిరంజీవి తనతో చెప్పారని నాగార్జున అన్నారు. ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయని అన్నారు. ఆ తర్వాత జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పారు. 'బంగార్రాజు'ను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెప్పారు.

Continues below advertisement

టికెట్ రేట్స్ ఇష్యూ విషయంలో నాగార్జున మాట్లాడలేదు. సినిమా వేదిక మీద రాజకీయాలు వద్దని అన్నారు. తొలుత సంక్రాంతికి నైట్ క‌ర్ఫ్యూ, 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం, ఆ తర్వాత ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి తర్వాత వరకూ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. నాగార్జున కోసమే నైట్ క‌ర్ఫ్యూను వెనక్కి నెట్టారని విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ మంత్రి, 'బంగార్రాజు' చిత్రదర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్నయ్య కురసాల కన్నబాబు, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్... ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోలకు మధ్య ఆ మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్స్ తగ్గించడాన్ని పవన్ కల్యాణ్, నాని, సిద్ధార్థ్ వంటి హీరోలు పబ్లిగ్గా వ్యతిరేకించారు. పరిశ్రమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఆయా హీరోల మాటల తర్వాత థియేటర్లలో అధికారులు తనిఖీలు చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నాగార్జున సినిమా విడుదల సమయంలో అటువంటివి ఏమీ లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Also Read: శాంతనుతో ఎప్పుడు ప్రేమలో పడిందీ, కలిసిందీ చెప్పిన శ్రుతీ హాసన్!
Also Read: ర‌జ‌నీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధ‌నుష్ చేసిన సాయం ఇదే!
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది..
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement