క్రెడిట్ కార్డు తీసుకుందామని ఓ యువకుడు ప్రయత్నించిన తొలి అడుగులోనే మోసానికి గురయ్యాడు. క్రెడిట్‌ కార్డు యూజర్‌ చార్జీల విషయం తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలోని నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బాలా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌లో నివాసం ఉండే రాజు గౌడ్‌కు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఆ బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డు పొందేందుకు ప్రయత్నించాడు. అసలు ఆ క్రెడిట్ కార్డుకు యూజర్‌ చార్జీలు ఎంత ఉంటాయో తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేసే యత్నం చేశాడు. 


వెంటనే ఓ వ్యక్తి రాజుగౌడ్‌కు ఫోన్‌ చేసి ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు కోసం మీ ఫోన్‌కు ఓ లింకు పంపిస్తానని.. దాంట్లో అన్ని వివరాలు నింపాలని చెప్పుకొచ్చాడు. అతను నిజమైన బ్యాంకు సిబ్బంది అని నమ్మిన రాజు గౌడ్ అతను చెప్పిన విధంగానే ఆ లింక్ ద్వారా తెరుచుకున్న ఫారంలో అన్ని వివరాలు నింపాడు. అనంతరం అవతలి వ్యక్తి కోరిన మేరకు ఫోన్‌కు వచ్చిన ఓటీపీ కూడా చెప్పేశాడు. ఆ ఓటీపీ నంబర్‌ చెబితే ఆ లింక్‌లో నింపిన అన్ని వివరాలు తనకు తెలుస్తాయని దుండగుడు నమ్మబలికాడు. దీంతో తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని రాజు గౌడ్‌ అదే విధంగా చేశాడు. కొద్ది సేపటి తరువాత అతడి అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.1,35,300 నగదు విత్‌డ్రా అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. 


Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?


ఆ మెసేజ్ చూసి తనకు అర్థం కాక, మళ్లీ ఆ నెంబరుకు ఫోన్ చేశాడు. ఫోన్ కలవకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఓటీపీలు చెప్పవద్దని బ్యాంకులు సహా పోలీసులు ఎంతో మంది అవగాహన కల్పిస్తున్నా ఇంకా పలువురు ఇలాగే మోసపోతూనే ఉన్నారు.


నకిలీ కాల్ సెంటర్ల పేరుతో దందాలో కీలక విషయాలు
మరోవైపు, ఇటీవలే నగరంలో వెలుగులోకి వచ్చిన నకిలీ కాల్ సెంటర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుదారులు, బ్యాంకులను ఓ ముఠా మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. సిస్టమ్‌లో మాల్‌వేర్ వైరస్ చొరబడిందని చెప్పి సైబర్ దుండగులు కోట్ల రూపాయలు మోసం చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రెండు ముఠాల కోసం గాలిస్తున్నారు.


Also Read: ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !


Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి