Breaking News Live Telugu Updates: నేడు వైన్ షాపులు బంద్, అయినా ఏరులై పారుతున్న మద్యం!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి మల్లారెడ్డి.
కార్యక్రమానికి హాజరైన కవిత కు మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థినుల ఘన స్వాగతం
విద్యార్థినులతో కలిసి బెలూన్లు ఎగరవేసిన ఎమ్మెల్సీ కవిత
మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా.. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను. నేను తుమ్మినా, దగ్గినా, ఫుల్ వైరల్ అవుతున్న. మల్లన్న అంటే క్రేజ్ ఉట్టిగానే రాలే.. కష్టపడ్డా. పూలమ్మిన, పాలమ్మిన’’ అనే డైలాగుతో మళ్ళీ విద్యార్థులను నవ్వించారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మితల్, ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, తెలంగాణ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మంత్రి తాడి శెట్టి రాజా మాట్లాడుతూ. కోనసీమ అల్లర్ల కేసులు తోలగింపుపై చర్చలు కోనసాగుతున్నాయని అన్నారు. మంత్రి, ఎమ్మేల్యే ఇళ్ళపై జరిగిన దాడులు కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులు తోలగింపుకు ప్రాధమికంగా నిర్ణయం జరిగింది పేర్కొన్నారు.
- హైదరాబాద్ ఇందిరా పార్కులో ఘనంగా హోలీ సంబరాలు
- పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
- అందరికీ హోలీ శుభాకాంక్షలు - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- హోలీ ఈ ఏడాది రెండు రోజులు వచ్చింది
- భారతదేశ పండగలు ఎంతో గొప్పవి.. హిందూ సాంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీక మన పండుగలు
- పండగల ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలి
- తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది - తలసాని
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరొకరు అరెస్టు అయ్యారు. అరుణ్ రామచంద్ర పిళ్లైని రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు. ఇటీవలే రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు 2 రోజుల పాటు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ లిక్కర్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం హోలీ పండగ సందర్భంగా 6వ తేదీ సాయంత్రం 6 నుండి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ లు, బార్ అండ్ రెస్టారెంట్, మూసివేయాలని ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆ ఆదేశాలకు భిన్నంగా విచ్చలవిడిగా మద్యం ఏరులై పారింది. ఒక క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయల అదనపు డబ్బులు వసూలు చేస్తూ అమ్మకాలు చేశారు. మందు కొనడానికి మందు బాబులు పోటీపడుతున్నారు. గాజులరామారంలో, జీడిమెట్ల ఇండస్ట్రీ నుండి సాయిబాబా నగర్ వెళ్లే దారిలో టీఎస్08 హెచ్ ఎక్స్ 3570 బెలెనో కారులో మందు బాటిల్స్ కాటన్ లను ఉంచిన బెల్ట్ షాప్ యజమాని శివారెడ్డిని ఈ విషయంపై వివరణ అడగగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నానని చెప్పారు. ఈ తతంగాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకెళ్లినా వారు అటువైపు చూడలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు మేలుకొని బెల్ట్ షాప్ ల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Background
దేశ రాజధానితోపాటు పలు చోట్ల తేలికపాటి వేడిగాలులు వీచే అవకాశం ఉండగా, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. IMD ప్రకారం, మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య, మధ్య,పశ్చిమ భారతదేశానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో జల్లులతో పాటు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
వాతావరణంపై వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం
వాతావరణ శాఖ ప్రకారం, నైరుతి రాజస్థాన్ మరియు దాని సమీప ప్రాంతాల్లో పశ్చిమ డిస్ట్రబెన్స్ పాక్షికంగా చురుకుగా ఉంటుంది. దీనితో పాటు, దక్షిణ కొంకణ్ మరియు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ద్రోణి అంటే అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా, మార్చి 6 నుండి 8 వరకు మధ్య భారతదేశంలో తేలికపాటి, మోస్తరు మరియు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 6 నుంచి 9 వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మార్చి 6 నుంచి 7 వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీనితో పాటు, మార్చి 6-7 తేదీలలో, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు, మార్చి 7న, పశ్చిమ రాజస్థాన్, మరఠ్వాడా, విదర్భలో వాతావరణం అలాగే ఉంటుంది.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -