Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 May 2022 10:33 PM
విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు

17 మంది మంత్రుల సామాజిక న్యాయభేరి బస్ యాత్ర భారీ వర్షం కారణంగా రద్దు అయింది.  విజయనగరం పట్టణంలోకి మంత్రుల బస్సు చేరుకునేసరికి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో  సభ నుంచి కార్యకర్తలు, ప్రజలు ఇంటి ముఖం పట్టారు.  సభ వద్దకు చేరుకున్న బస్సులోంచి మంత్రులు దిగటానకి కూడా వీలులేకుండా వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. చివరికి స్టేజీ మీదకి మంత్రులు వచ్చే సరికి ప్రజలు ఎవరు లేకపోవడంతో, సభ రద్దు చేసుకొని తిరిగి బస్ లో మంత్రులు వెళ్లిపోయారు. రేపటి యాత్ర కోసం బస్ విశాఖపట్నం వెళ్లిపోంది. భారీ జన సమీకరణ జరిగిన సభ రద్దు అవ్వడంతో స్థానిక నేతలు నిరాశ చెందారు. 

విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు

17 మంది మంత్రుల సామాజిక న్యాయభేరి బస్ యాత్ర భారీ వర్షం కారణంగా రద్దు అయింది.  విజయనగరం పట్టణంలోకి మంత్రుల బస్సు చేరుకునేసరికి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో  సభ నుంచి కార్యకర్తలు, ప్రజలు ఇంటి ముఖం పట్టారు.  సభ వద్దకు చేరుకున్న బస్సులోంచి మంత్రులు దిగటానకి కూడా వీలులేకుండా వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. చివరికి స్టేజీ మీదకి మంత్రులు వచ్చే సరికి ప్రజలు ఎవరు లేకపోవడంతో, సభ రద్దు చేసుకొని తిరిగి బస్ లో మంత్రులు వెళ్లిపోయారు. రేపటి యాత్ర కోసం బస్ విశాఖపట్నం వెళ్లిపోంది. భారీ జన సమీకరణ జరిగిన సభ రద్దు అవ్వడంతో స్థానిక నేతలు నిరాశ చెందారు. 

CM Stalin : కేంద్రం నిధులు ఇవ్వడంలేదు, ప్రధాని మోదీ ముందే తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు 

CM Stalin : కేంద్రం నుంచి తమిళనాడుకు నిధులు రావడంలేదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రధాని మోదీ ముందే సీఎం స్టాలిన్  ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి ద్రవిడియన్ స్టైల్ పాలన చూపిస్తామన్నారు. రాష్ట్రాలతో కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం అన్నారు. అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తున్నారు కానీ నిధులు ఇవ్వడంలేదన ప్రధాని ముందే సీఎం స్టాలిన్ అన్నారు. 

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం, సాంకేతిక సమస్యతో నిలిచిన రైలు

Hyderabad Metro Rail : హైదరాబాద్‌ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో రైలు సాంకేతిక సమస్యలో నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో కారిడార్‌లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మెట్రో స్టేషన్లలో భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచిచూడడంతో రద్దీ నెలకొంది.

సత్తెనపల్లిలో రూ.11 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం

Sattenapalli : పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధిలోని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అక్రమ మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. సీజ్ చేసిన 14 వందల లీటర్లు, సుమారు రూ.11 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు.  ఎక్సైజ్ ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, సెబ్ సీఐ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం చేశారు. 

జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం : సీఎం కేసీఆర్ 

బెంగళూరులో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. 

Hyderabad Rains : హైదరాబాద్ లో మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. 


 

Accident In Krishna District: కృష్ణాజిల్లా మోపిదేవిలో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా- నలుగురు మృతి

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కాసానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందిన వీళ్లంతా మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

CM KCR In Bengaluru: బెంగళూరుకు చేరిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అగ్ర నేత కుమార స్వామి నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్‌కు కుమార స్వామి ఘన స్వాగతం పలికారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కుమార స్వామితో ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి, దేశ రాజకీయాల గురించి ముగ్గురు నేతలు మాట్లాడుకోనున్నారు.

PM Modi In Hyderabad: సంక్షేమ పథకాల విషయంలో రాజకీయాలు సరికాదు

‘‘తెలంగాణలో ఒక నిజాయతీ పాలన అవసరం ఉంది. అది బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రజల మనస్సు నుంచి మా పేర్లను ఎవరూ చెరపలేరు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సూత్రంతోనే బీజేపీ పని చేస్తోంది. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇలాంటి పథకాల విషయంలో రాజకీయాలు చేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు తెలంగాణ ప్రజలు పొందే హక్కు ఉంది. తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు. 2024లో కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుందని నేను భావిస్తున్నాను’’ అని మోదీ అన్నారు.

PM Modi Speech: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం - మోదీ

తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్లు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దానిపై మేం చేస్తున్న పోరాటం ఫలితాన్ని ఇస్తోంది. మేం తెలంగాణ బాగుకోసమే పోరాడుతున్నాం. కుటుంబ పార్టీలు దేశానికి చేటు. వాటివల్ల అవినీతి పెరిగిపోతుంది. తెలంగాణలో మార్పు రావడం తథ్యం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే. 

PM Modi Speech on CM KCR: కేసీఆర్‌పై ప్రధాని మోదీ విమర్శలు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ నేతల్ని కలిశారు. అక్కడే పార్టీ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పాలనపై నేరుగా విమర్శలు చేశారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని మోదీ అన్నారు. ఓ కుటుంబం అధికారంతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి మరింత పెరిగిపోతుందని అన్నారు.

PM Modi Reaches Hyderabad: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని బేగంపేటకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం బయట బీజేపీ నేతలను కలిశారు. దూరం నుంచి బీజేపీ కార్యకర్తలకు అభివాదం తెలిపారు.

BJP Leaders at Begumpet Airport: బేగంపేట ఎయిర్ పోర్టుకు తరలుతున్న బీజేపీ శ్రేణులు

ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్న వేళ బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకున్నారు. పులి వేషాలు, డప్పు చప్పుళ్లతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

Modi Hyderabad Tour Schedule Change: మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26) హైదరాబాద్ కు రానున్న వేళ ఆయన పర్యటన విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి ఉండగా, కాస్త ముందుగా 12.50 నిమిషాలకు రానున్నారు. ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత బేగంపేట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

PM Modi Tour - Traffic Diversions in Hyderabad: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ మళ్లింపులు ఇవీ

ప్రధాని మోదీ పర్యటన వేళ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..


* లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్ తీసుకొని, మసీద్ బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.


* విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసుకొని, HCU బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.


* విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.


* కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు.


* గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని, బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, HCU డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.

Vijayawada: విజయవాడలో చిరు వ్యాపారుల మధ్య వివాదం

విజయవాడ నగరంలోని కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం నెలకొంది. రోడ్లపై వ్యాపారాలు చేస్తూ చిరువ్యాపారులు ట్రాఫిక్‌‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ మార్కెట్ వద్దకు ఆక్రమణల నిర్మూలన దళ (వీఎంసీ) సిబ్బంది వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది రోడ్లపై పండ్ల వ్యాపారం చేసే బుట్టలు లాక్కెళ్లారు. దీంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎంసీ సిబ్బంది ఉన్న వాహనాన్ని చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.

Revanth Reddy America Tour: అమెరికాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండనున్నారు.

CM KCR Bengaluru Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు పర్యటన షెడ్యూల్ ఇదీ

  • ఈ రోజు ఉదయం బెంగుళూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  • 9.45 కి ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్లనున్న సీఎం

  • 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్న సీఎం

  • 11 గంటలకు HAL ఎయిర్ పోర్టుకి..

  • 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్ కి కేసీఆర్

  • 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరనున్న సీఎం

  • 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి..

  • దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ ప్రధాని దేవగౌడతో చర్చించనున్న సీఎం

  • దాదాపు రెండున్నర గంటల పాటు దేవగౌడతో సమావేశం కానున్న సీఎం

  • 3.45 కి దెవగౌడ నివాసం నుంచి HAL ఎయిర్ పోర్టుకి చేరుకోనున్న సీఎం

  • 4 గంటలకు HAL నుంచి హైదరాబాద్ కి

  • 5 .10 కి ప్రగతి భవన్ కి చేరుకోనున్న సీఎం కేసీఆర్

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం

హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌ సమీపంలో లాడ్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో దుకాణం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Background

నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతాల్లో నేడు వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు కూడా ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


ఏపీలోని కొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వేళ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఉమ్మడి విశాఖ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం పడింది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ, విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం వల్ల కొన్ని చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా, రాత్రి వాన పడింది.


తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 4 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు ఇంకా పెరిగింది. నేడు గ్రాముకు ఏకంగా రూ.15 చొప్పున పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,250 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,500 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,250గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,500 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.