Suzuki Access 125 Price: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కొత్త మైలురాయిని సాధించింది. మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటైన యాక్సెస్ 125... ఆర మిలియన్ యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని సాధించింది. ఈ స్కూటర్ గత 18 సంవత్సరాలుగా భారత మార్కెట్లో ఉంది. సుజుకి కంపెనీ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ ఇదే. ఈ స్కూటర్ 2006 సంవత్సరంలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి దీనికి సంబంధించి 60 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయబడ్డాయి.
సుజుకి యాక్సెస్ 125
సుజుకి యాక్సెస్ 125 సీసీ స్కూటర్. ఈ స్కూటర్ దాని స్మూత్ పెర్ఫార్మెన్స్, మంచి మైలేజీ, తక్కువ ధరకు ప్రసిద్ధి చెందింది. సుజుకి యాక్సెస్ 125తో పోటీపడే అనేక స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. హోండా యాక్టివా 125, ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 125, వెస్పా వీఎక్స్‌ఎల్ వంటి అనేక ఇతర స్కూటర్లకు భారత మార్కెట్లో ఇది పోటీ ఇవ్వనుంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
యాక్సెస్ 125 ఇంజిన్ ఎలా ఉంది?
సుజుకి యాక్సెస్ 125 ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. స్కూటర్‌లోని ఈ ఇంజన్ 6,750 ఆర్‌పీఎం వద్ద 8.58 బీహెచ్‌పీ పవర్, 5,500 ఆర్‌పీఎమ్ వద్ద 10 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లోని మోటారు సీవీటీ యూనిట్‌కి కనెక్ట్ అయింది. ఈ స్కూటర్ సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీతో వస్తుంది. ఈ సుజుకి స్కూటర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌ల కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
సుజుకి యాక్సెస్ 125 ఫీచర్లు
సుజుకి యాక్సెస్ 125 అప్‌డేటెడ్ మోడల్ రైడ్ కనెక్ట్ ఎడిషన్, దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ బ్లూటూత్‌తో కనెక్ట్ అయింది. దీంతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలెర్ట్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ స్కూటర్ కన్సోల్‌లో మిస్డ్ కాల్స్, అన్‌రీడ్ మెసేజ్ అలెర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సుజుకి స్కూటర్‌లో 22.3 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఈ స్కూటర్ సీటు పొడవుగా ఉంది. దీన్ని సులభంగా స్టార్ట్ చేయవచ్చు.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?