Bengaluru man drives cab at 3 am after sleepy driver hands him the keys: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో తూలిపోతూంటే ఏం చేస్తారు ?. వెంటనే దిగి వేరే క్యాబ్ చూసుకుంటారు. అది తెల్లవారుజామున ఇంకెక్కడా క్యాబ్‌లు దొరకకపోతే నడిరోడ్డులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం ఉంటుంది. ఈ భయంను ఎలా జయించాలో చాలా కొద్ది మందికే తెలుసు.అందులో మిలింద్ చందల్వాల్ ఒకరు.రెండు రోజుల కిందట బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు అప్పుడు తెల్లవారుజాము మూడు అయిందని తెలిసింది. అయినా క్యాబ్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్ క్యాబ్ తీసుకుని వచ్చాడు. మిలింద్ ఎక్కి కూర్చున్నాడు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్ మీదకు వచ్చేసరికి క్యాబ్ ఊగిపోతోంది. ఏమిటా అని చూస్తే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు.
వెంటనే మిలింద్ కంగారు పడలేదు. అ డ్రైవర్ మీద అరవలేదు. అంత నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తే కారుకు.. ప్రాణాలకు కష్టం అని చెప్పాడు. కానీ తనకు డ్యూటీ చేయక తప్పని పరిస్థితి అని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో మిలింద్ ఓ ఐడియా చెప్పాడు. నేను క్యాబ్ డ్రైవ్ చేస్తా.. నువ్ రెస్టు తీసుకో అని చెప్పాడు. ఆ సలహా ఆ క్యాబ్ డ్రైవర్ కు కూడా నచ్చింది. క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ మిలింద్ తన ఇంటి వరకూ వచ్చాక అతన్ని లేపి కీస్ చేతిలో పెట్టాడు. ఆన్ లైన్ ఆటోమేటిక్ పేమెంట్ కాబట్టి టిప్ కూడా అందులో జమ చేశాడు.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
తనకెదురు అయిన అనుభవాన్ని మిలింద్ ఇన్ స్టాలో పంచుకున్నారు. దాంతో ఆ విషయం వైరల్ అయిపోయింది.
Also Read: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
మిలింద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో చదివారు. ఆయన బెంగళూరులో ఓ స్టార్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. తరచూ ప్రయాణాలు చేస్తూంటారు. తెల్లవారు జామున మూడు గంటలకు ఎయిర్ పోర్టుకు రావడం వెళ్లడం సహజమే. అయితే ఇలాంటి అనుభవం మాత్రం కొత్త అంటున్నారు. మిలింద్ కు ఆ క్యాబ్ డ్రైవర్ ప్రైవసీ గురించి కూడా తెలుసు. ఆతని ఐడెంటీటీ బయటపడకుండా జాగ్ర్తతలు తీసుకున్నారు.