Breaking News Live:హైదరాబాద్ లో దారుణం, ఆటో ఎక్కిన యువతిపై నలుగురు అత్యాచారం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Mar 2022 07:02 PM
హైదరాబాద్ లో దారుణం, ఆటో ఎక్కిన యువతిపై నలుగురు అత్యాచారం 

హైదరాబాద్ లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు యువకులు అత్యాచారం చేశారు. హైదరాబాద్ జిల్లెలగూడ గాయత్రి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదుతో నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

RRR Movie: థియేటర్‌లో గన్‌తో హల్ చల్

* తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో RRR సినిమా ఆడుతున్న శ్రీ అన్నపూర్ణ థియేటర్‌లో గన్ తో అభిమాని హల్చల్


* సినిమా థియేటర్ బయట గన్ తో ఫోజులు


* థియేటర్ లో తెరముందు గన్ తో  తిరుగుతూ కేరింతలు


* నిజం తుపాకినా, డమ్మీనా తెలియక ఆందోళన పడ్డ జనం


* పిఠాపురానికి చెందిన వ్యక్తి విశ్వహిందూ పరిషత్ లోని వ్యక్తిగా గుర్తింపు

థియేటర్ల వద్ద బ్లాక్‌లో RRR టికెట్స్

* RRR థియేటర్ల వద్ద బ్లాక్ లో టిక్కెట్ల రచ్చ


* 230/రూ టిక్కెట్ ధర.. బ్లాక్ లో రూ.1200 నుండి రూ.2 వేలకు పైమాటే..


* ఉదయం 5 గంటల నుండి కౌంటర్ వద్ద క్యూలో నిలబడ్డా దొరకని RRR టిక్కెట్స్


* థియేటర్ లో సిబ్బంది బ్లాక్ లో టిక్కెట్స్ అమ్ముతున్న వైనం..


* థియేటర్ లోపలే యాజమాన్యం కనుసన్నల్లోనే సిబ్బంది చేతివాటం

Bhatti Vikramarka: నేటి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర పున:ప్రారంభం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో చేపట్టిన పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. గత నెల 27న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం యడవల్లిలో పాదయాత్ర చేపట్టి ఈ నెల 5 వరకు గంధసిరి వరకు 102 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉండడంతో భట్టి తన పాదయాత్రకు తాత్కాలికంగా నిలిపేశారు. సమావేశాలు ముగియడంతో శుక్రవారం ముదిగొండ మండలం అమ్మపేటలోని వెలిగొండ స్వామి ఆలయం నుంచి తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించబోతున్నారు.

Background

ఏపీ, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి (మార్చి 25) వచ్చే 5 రోజుల పాటు వర్ష సూచన ఏమీ లేదు. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 


మరోవైపు, ఏపీలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. మొన్న అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద  తీరాన్ని దాటింది. దీని ప్రభావం స్వల్పంగా ఏపీపైనా కనిపించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడింది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ. దాకా వీచింది.


‘‘ఈ రోజు, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఎండలు కొనసాగనుంది. వర్షాలు విశాఖ ఏజెన్సీలో అక్కడక్కడ నమోదవ్వనుంది. కానీ ఈ నెల 26 నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. కోస్తాంధ్ర​, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతల నుంచి ఇటీవలి వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం రోజుల్లో నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్టు విడుదల చేసింది. కొత్తగూడెం, వనపర్తిల్లో అధికంగా, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణంగా హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రం భీమ్, మహబూబాబాద్, నారాయణ్ పేట, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తక్కువ వర్షపాతం, జోగులాంబ గద్వాలలో ఇంకా తక్కువగా, మిగతా జిల్లాల్లో అసలు వానలే లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


బంగారం వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బాగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు బంగారం ధర గ్రాముకు రూ.60 పెరిగింది. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.900 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,310 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,800 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,670గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,800 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.