టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ నాయకురాలైన ఆమె తరచుగా వివాదాస్పద అంశాలతో వార్తలో నిలుస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సమాజంలో జరిగే ఇతర విషయాలపై కూడా రెస్పాండ్ అవుతూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొడుతుంది. అయితే రెండ్రోజుల క్రితం ఆమె జేసి ప్రభాకర్ రెడ్డిపై చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన కూడా మాధవీలతపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో, ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. చివరికి ఆయన తప్పయింది అంటూ సారీ చెప్పినప్పటికీ, ఈ వివాదం శాంతించినట్టుగా కనిపించట్లేదు. తాజాగా మాధవీలత షేర్ చేసిన మరో వీడియో వైరల్ అవుతుంది. 


నా ఆత్మగౌరవం మీద దాడి... 
తాజాగా మాధవీలత బోరున విలపిస్తూ ఓ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇక ఆ వీడియోకి సుదీర్ఘ నోట్ రాసి తన మనసులోని ఆవేదనను బయట పెట్టింది.  ఆ నోట్ లో "ఎమోషనల్ అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాను. కానీ నేను కూడా మనిషినే కదా? నా ఆత్మగౌరవం మీద జరిగిన దాడి వల్ల కలిగిన బాధను వర్ణించడానికి పదాలు లేవు. ప్రతిక్షణం వేదన, దుఃఖం, నిరాశ, కోపం... అన్నీ నన్ను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ఎన్నోసార్లు ఎంతమందో ప్రయత్నించారు. పదేపదే ఇలాంటి మాటలు అన్నారు. నా పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం, మహిళల కోసం... నిస్వార్ధంగా నా వంతుగా నేను పోరాడుతున్నాను. ఎవరికి ద్రోహం, మోసం చేసింది లేదు. ఒకరి దగ్గర ఒక్క పైసా తీసుకున్నది లేదు. కానీ నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు అంటున్నారు. ఒక ఆడపిల్లగా నేను ఎప్పుడూ సింపతి గేమ్ ఆడలేదు. అలాగే మగాడిలా పోరాడుతున్నాను. త్వరలోనే ఈ కష్టాలను అధిగమిస్తాను. నాకు సపోర్ట్ గా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమిస్తారని ఆశిస్తున్నాను" అంటూ మాధవీలత కంటతడి పెట్టుకున్న వీడియోని షేర్ చేసింది.



Also Read:వార్నీ... 'జబర్దస్త్' బ్యూటీ ఒరిజినల్ పేరు రీతూ చౌదరి కాదు - 700 కోట్ల లాండ్ స్కాంతో ఆ సీక్రెట్, అసలు పేరు వెలుగులోకి


జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారంటే? 
2025 న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దంటూ మాధవీలత ఓ షాకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. అందులో జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్ లు ఉంటాయని హెచ్చరిస్తూ, దాడులు చేస్తే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించింది. అందుకే ఆడపిల్లలు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి అంటూ ఆ వీడియోలో మాధవీలత చెప్పింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయంపై సీరియస్ అవుతూ, ఘాటుగా సమాధానం ఇచ్చారు. కానీ మాధవీలత చేసిన వ్యాఖ్యల కంటే, ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో "ఆవేశంలో అన్నాను. క్షమించండి" అంటూ ఆయన దిగివచ్చారు. ఈ నేపథ్యంలోనే మాధవీలత ఏడుస్తూ కొత్త వీడియోను రిలీజ్ చేసింది.


Also Read: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు