రీతూ చౌదరి (Rithu Chowdary)... తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పేరు. అటు వెండి తెర, ఇటు బుల్లితెర... రెండిటిలో ఆవిడ సందడి ఉంది. అయితే... ఈటీవీలో వచ్చే 'జబర్దస్త్' ప్రోగ్రాం ఆమెను ఎక్కువ పాపులర్ చేసింది. 'ఫ్యామిలీ స్టార్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోస్ కూడా ఆవిడ చేసింది. రీతూ చౌదరిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీతూ పాపులర్ సెలబ్రిటీ. అయితే... ఆవిడ అసలు పేరు అది కాదని తెలుసా?


స్కాంతో పాటు అసలు పేరు వెలుగులోకి!
టీవీ షోలు, సినిమాల్లో కనిపించే రీతూ చౌదరి పేరు ఇప్పుడు వందల కోట్ల విలువైన స్కాంలో వినబడుతోంది. సుమారు 700 కోట్ల విలువ చేసే ఆస్తులను చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు, అతను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బినామీ అని మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో రీతూ చౌదరి పేరు బలంగా వినబడుతోంది.


నిజం చెప్పాలంటే... రీతూ చౌదరి పేరు లేదు. ఆవిడ ఫోటో మాత్రమే ఉంది. ఆ ఫోటో కింద ఉన్న వనం దివ్య (Vanam Divya) అని ఉంది. ఈ ట్విస్ట్ ఏమిటి? అంటే... రీతూ చౌదరి అసలు పేరు అదే మరి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్న తరుణంలో తన పేరును వనం దివ్య నుంచి రీతూ చౌదరిగా మార్చుకుందీ బ్యూటీ. అందువల్ల, కన్‌ఫ్యూజ్ ఏర్పడింది. ఆ ఫోటోలో అమ్మాయి రీతూ చౌదరియేనా? కదా? అని జనాలు అనుకున్నారు. 


తన పేరు వనం దివ్య అని రీతూ చౌదరి కన్ఫర్మ్ చేసింది. పేరు మార్చుకున్నానని కూడా చెప్పింది. అదీ అసలు విషయం. ఆవిడ తండ్రి పేరు వనం శేఖర్.


శ్రీకాంత్ చీమకుర్తితో రీతూకు పెళ్లయిందా?
రీతూ చౌదరి తన పేరు వనం దివ్య అని క్లారిటీ ఇచ్చింది. కానీ, పెళ్లి విషయంలో ఆమె ఫుల్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు తనకు, శ్రీకాంత్ చీమకుర్తికి ఎటువంటి సంబంధం లేదని ఆవిడ చెబుతోంది. తమ గొడవ కోర్టులో ఉందని అంటోంది. కానీ అతనితో రిలేషన్షిప్ ఏమిటనేది క్లారిటీ ఇవ్వడం లేదు.


Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను కాకుండా తమిళ హీరోలను ఇన్వైట్ చేశారా? అసలు నిజం ఏమిటి?


చీమకుర్తి శ్రీకాంత్ తనకు వద్దని ఆల్రెడీ కోర్టులో చెప్పానని, అతనితో సంబంధం లేదని రీతూ చౌదరి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ తన భర్త కాదంటోంది. అంతే కానీ తనకు పెళ్లి కాలేదని ఆవిడ చెప్పడం లేదు. విచిత్రం ఏమిటంటే... ఇదే రీతూ చౌదరి రెండేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఆ శ్రీకాంత్ చీమకుర్తితో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Also Read: కియారా అడ్వాణీ ఎందుకు రావడం లేదు? ముఖ్యంగా రాజమండ్రిలో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డుమ్మా కొట్టడానికి రీజన్ ఏమిటో తెలుసుకోండి