Seethe Ramudi Katnam Serial Today Episode ఆశ్రమంలో వైద్యం పొందుతున్న మహాలక్ష్మీ యాక్సిడెంట్ గుర్తొచ్చి లేస్తుంది. ఎక్కడున్నాడు.. మీరంతా ఎవరు అని ప్రశ్నిస్తుంది. ప్రమాదంలో కొన ఊపిరితో ఉన్న నిన్ను మా శిష్యులు తీసుకొచ్చి వైద్యం ఇస్తున్నామని చెప్తారు. నేను వచ్చి ఎన్ని గంటలు అయిందని మహాలక్ష్మీ అడిగితే గంటలు కాదు కొన్ని నెలలు అయిందని చెప్తుంది. ఇక మహాలక్ష్మీ ఇంటికి వెళ్తానని చెప్పి ఖర్చులకు అయిన డబ్బు ఆశ్రమానికి పంపిస్తానని అంటుంది.


విద్యాదేవి: సీత నేను చేసింది కరెక్టేనా
సీత: అలా ఎందుకు అనుకుంటారు అత్తమ్మ మామయ్య ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. దైవ నిర్ణయం లేకుండా ఏదీ జరగదు కదా అత్తయ్య.
విద్యాదేవి: నీ వల్లే మేం ఒకటి అయ్యాం సీత.
సీత: ఈ పెళ్లి గురించి అమ్మానాన్నలకు తెలిస్తే చాలా సంతోషిస్తారు కానీ రెండు సార్లు అమ్మా నాన్నలు లేరు.
విద్యాదేవి: నేను ఎవరో తెలీకుండా నా భర్తతో నాకు మళ్లీ పెళ్లి చేశావు.
సీత: ఇదే మాంగల్యానికి మరో ముడి అంటారు కదా అత్తయ్య. అందరూ తమ భర్తలతో మూడు ముళ్లు వేయించుకుంటారు మీరు మాత్రం మామయ్యతో ఆరు ముడులు వేయించుకున్నారు. మీరు ఎప్పటికీ విడిపోకూడదు.
విద్యాదేవి: ఈ జన్మకి ఇది చాలు సీత మనం ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి
సీత: ఉంటాం అత్తయ్య మన మధ్యలోకి మహాలక్ష్మీ అత్తయ్య రాకపోతే సంతోషంగా ఉంటాం.


మహాలక్ష్మీ రోడ్డు మీద ఉంటే పోలీస్ త్రిలోక్ వస్తాడు. నెలలు గడిచిపోయావని మీరు చనిపోయారు అనుకున్నాం అని అంటాడు. దాంతో కారు బ్రేకులు ఫెయిల్ అయి లోయలోకి వెళ్లిపోయిందని డోర్ ఓపెన్ అయి గాయాలతో ఉన్న తనని ఆశ్రమానికి తీసుకెళ్లి కాపాడారని చెప్తుంది. ఇక సుమతిని అరెస్ట్ చేసి జైలుకి పంపారా చిప్పకూడు పంపారా అని అడుగుతుంది.  సుమతి జనార్థన్‌ని పెళ్లి చేసుకుందని త్రిలోక్ మహాలక్ష్మీకి చెప్తాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. మహాలక్ష్మీకి కళ్లు తిరుగుతాయి. నేను పోతే ఇలా ఎలా పెళ్లి చేసుకుంటాడని బాధ పడుతుంది. దాంతో ఇదంతా సీత ప్లాన్ అని  చెప్తాడు. మహాలక్ష్మీ కోపంగా ఇంటికి వెళ్తుంది. అందరూ మహాలక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. 


జనార్థన్: మహా నిజమేనా ఇదంతా నువ్వు చనిపోయావని చెప్పారు.
మహాలక్ష్మీ: ఆ యాక్సిడెంట్‌లో నేను చనిపోలేదు జనా అదృష్టవశాత్తు బతికాను
రామ్: ఇదంతా మా అదృష్టం పిన్ని.
సీత: ప్రాణాలతో బయట పడిన మీరు ఇన్నాళ్లు మీరు ఎక్కడ ఉన్నారు అత్తయ్య
మహాలక్ష్మీ: నేను తిరిగిరావడం చాలా బాధగా ఉంది కదా నీకు. నేను లేను అని ఇక్కడ చాలా జరిగిపోయావంట. హాల్‌లో విద్యాదేవి, జనార్థన్‌ల పెళ్లి ఫొటో చూసి షాక్ అవుతుంది. ఈ ఫొటో ఏంటి ఈ పెళ్లి ఏంటి. కొన్ని నెలలు ఇంట్లో లేకపోతే ఏమేనా చేస్తారా.
సీత: మీరు బతికి వస్తారా అని మాకు తెలుసా ఏంటి. అందుకే మామయ్య టీచర్ పెళ్లి చేసుకున్నారు.
మహాలక్ష్మీ: ఏంటి జనా ఇది నేను లేను అని ఇలా చేస్తావా ఇంతేనా నా మీద నీకు ఉన్న ప్రేమ ఇంతేనా నాకు ఉన్న విలువ.
విద్యాదేవి: మీరు లేరు అని ఆయన డిప్రెషన్‌లో ఉన్నారు అందుకే ఇలా అయింది.
అర్చన: అంతా వట్టిదే మహా నువ్వు లేకపోవడంతో అంతా వీళ్ల ఇష్టారాజ్యం అయిపోయింది. 
రామ్: ఇందులో సీత, టీచర్ తప్పు లేదు పిన్ని మీరు లేకపోవడంతో ఇంట్లో ఆఫీస్‌లో ప్రాబ్లమ్స్ రావడంతో ఈ పెళ్లికి నేను అడ్డు చెప్పలేకపోయాను.
సీత: అప్పట్లో సుమతి అత్తమ్మ చనిపోయింది అనుకొని మిమల్ని చేసుకున్నారు ఇప్పుడు మీరు చనిపోయారు అనుకొని టీచర్ని చేసుకున్నారు. 
విద్యాదేవి: తను చేసిన పని కొందుకు చేస్తే తట్టుకోలేరు మహాలక్ష్మీ నీ పరిస్థితి ఎలా ఉందో మరి
చలపతి: టీచర్ ఉన్నా సరే నీకు బావ ఏ లోటు చేయడు లే మహాలక్ష్మీ చెల్లి
జనార్థన్: నువ్వు లేనప్పుడు ఇక్కడ జరిగినవి మార్చలేం మహా సర్దుకుపోక తప్పుదు.
అర్చన: విద్యాదేవిని సవతిలా సర్దుకోమని చెప్తున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!