Formula E Car Race Case | హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ (Formula E Race) కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.


విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తాను చట్టాలను అనుసరించి, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి 


ఉదయం కేసీఆర్ నివాసంలో లీగల్ టీంతో కేటీఆర్ భేటీ


అంతకుముందు సోమవారం ఉదయం నందినగర్ లోని తన తండ్రి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. అక్కడ లీగల్ టీమ్ తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ ప్రశ్నలపై ఎలా స్పందించాలి, చెప్పాల్సిన సమాధానాలపై లాయర్లతో చర్చించారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ నేరుగా ఏసీబీ ఆఫీసుకు విచారణకు హాజరయ్యారు.


 



2022 జులై లో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ (Formula E Car Race)లో దాదాపు 50 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను బీఆర్ఎస్ సర్కార్, మాజీ మంత్రి కేటీఆర్ విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ అనుమతి కోరారు. నెల రోజులకు గవర్నర్ జిష్ణుదేవ్ పర్మిషన్ తో ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ ఇదివరకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే అంశంపై కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.


అదో చెత్త కేసు అంటున్న బీఆర్ఎస్ నేతలు
కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఫార్ములా ఈ రేస్ కేసును తెరపైకి తెచ్చారు. ఎలాంటి అక్రమాలు జరగకున్నా, ఆరోపణలు చేస్తూ కేటీఆర్ మీద చెత్త కేసు నమోదు చేశారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తనకున్న అధికారాలతో నగదు విషయంపై తాను అనుమతి ఇచ్చానని.. ఇందులో ఎలాంటి ఇల్లీగల్ ప్రాసెస్ లేదని కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.


Also Read: Adilabad News: నేడు ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతల పర్యటన - పోలీసుల భారీ బందోబస్తు