HMPV Case Cases in India | చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్ తొలి కేసు భారత్‌లో గుర్తించారు. బెంగుళూరు ఆసుపత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. ఇదే భారత్ లో HMPV వైరల్ తొలి కేసు కానుంది. అంతలోనే మరో చిన్నారికి సైతం వైరస్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. బాప్టిస్ట్ ఆసుపత్రిలో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది. రెండు పాజిటివ్ కేసులు వచ్చాయని ఐసీఎంఆర్ నిర్ధారించింది. అయితే ఇక్కడ ల్యాబులలో టెస్టులు నిర్వహించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఆ చిన్నారికి ఎక్కడా ప్రయాణించలేదని.. అయినా ప్రమాదకర వైరస్ పాజిటివ్ రావడం నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు.
ఇంకా నిర్ధారించని కర్ణాటక వైద్య శాఖ
బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో వైరస్ కేసు నమోదైనట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ చిన్నారికి సోకింది హెచ్ఎంపీవీ వైరస్ అని ఇంకా తాము నిర్ధారించలేదని పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వరం గొంతు నొప్పి లాంటివి కరోనా వైరస్ లక్షణాలలో ఉన్నాయి. ప్రస్తుతం చైనాతో పాటు హాంకాంగ్, మలేషియా సహా పలు దేశాలలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌వి, జలుబు, ఇన్‌ఫ్లుఎంజా, సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల లాగే ఈ వైరస్ లక్షణాలు ఉంటాయని కర్ణాటక వైద్యశాఖ తెలిపింది.
HMPV లక్షణాలు జలుబు లేక ఫ్లూ లక్షణాల లాగే ఉంటాయి. కానీ లక్షణాలు ఉన్నాయి కదా అని అది హెచ్ఎంపీవీ వైరస్ కేసు అని చెప్పలేమని డాక్టర్ సౌరభ్ పహుజా అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇలాగే జరిగింది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న అందరిలో కరోనా వ్యాప్తి చెందలేదు. కానీ కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన చాలా మందిలో ఆ లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. ప్రత్యేకమైన ల్యాబులలో పరీక్షించిన తరువాతే కరోనా, హెచ్ఎంపీవీ కేసులను నిర్ధారించడం సాధ్యమన్నారు.