Breaking News Live: శాసనమండలి ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు బాధ్యతలు స్వీకరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును ఛైర్ వద్దకు తీసుకొచ్చిన సీఎం జగన్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడని సీఎం అన్నారు. మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన కారణంగా శాసనసభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఏడాదిగా బుల్లెట్‌లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లకు ఎదురెళ్లి రైతులు చివరికి విజయం సాధించారని కొనియాడారు. ఈ మేరకు హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘‘రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్ లకు, లాఠీలకు, వాటర్ కానన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. రాత్రింబవళ్ళు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Background
కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. వరంగల్ వేయిస్తంభాల ఆలయం, రామప్ప రామలింగేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. అటు కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో మహిళలు దీపాలను వదిలారు. ఆలయాల్లోనూ మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి స్వామి ఆలయాలకు భక్తులతో బారులు తీరారు. నదీ తీర ఆలయాల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
పెట్రోల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర కూడా స్థిరంగా ఉండి రూ.107.69 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా పెరిగింది. లీటరుకు రూ.0.14 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.51 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు పెరిగి రూ.96.59గా ఉంది.డ
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు కాస్త పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.10 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.0.40 పైసలు పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,400గా ఉంది.
Also Read: అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వానలు.. చెన్నై-పుదుచ్చేరి మధ్య శుక్రవారం తీరం దాటే అవకాశం
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -