AP CM Chandra Babu Speech In Modi Meeting: విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడు సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్నామని అన్నారు. ఆయన చొరవతోనే అమరావతి ముందుకెళ్తోందని రేపు పూర్తి నిర్మాణం అయిన తర్వాత ఆయన ప్రారంభోత్సవం చేస్తారని అన్నారు. విశాఖలో నేడు 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చరిత్రలో ఇలాంటి సన్నివేశం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజలు మెచ్చిన నాయకుడు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తాడని మోదీని ఉద్దేశించి అన్నారు. ఆయన తనకు ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటూనే ఉంటారన్నారు. 






రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభించామన్నారు చంద్రబాబు. ఏడు రైల్వే ప్రాజెక్టుల్లో రూ.6,177 కోట్లు పెడుతున్నట్టు తెలిపారు. మూడు రైల్వే ప్రాజెక్టులు రూ.5,718 కోట్లతో ప్రారభించారని వెల్లడించారు. నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులను ఆహ్వానించే బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేశామని వివరించారు. కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులను క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా పెడుతున్నట్టు వెల్లడించారు. వీటన్నింటి కంటే విశాఖ వాసుల చిరకాల స్వప్నం రైల్వే జోన్‌కు శంకుస్థాపన కూడా మర్చిపోలేనిదిగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలా వివిధ రకాల పనులు ఏపీ చరిత్రనే మార్చేయబోతున్నాయని తెలిపారు.  






ఏడు నెలల్లోనే ఏపీకి ఇంత చేశారంటే మోదీ నిబద్ద అర్థమవుతుందన్నారు చంద్రబాబు. అందుకే ఆయన వెంటే ఏపీ ఉంటుందని మాట ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఆర్థిక సాయం చేశారని ఆక్సిజన్‌లో అవి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కేంద్రం అందిస్తున్న సాయంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయన్నారు. మోదీ చొరవ కేంద్ర సాయంతో ఆంధ్రప్రదేశ్ పరపతి పెంచుకుంటున్నామని వివరించారు. అమరావతితోపాటు పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అన్న చంద్రబాబు భవిష్యత్లో కూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని అన్నారు.    


Also Read: చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా