టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే అప్రమత్తమైన నీరజ్ చోప్రా RT-PCR టెస్టు చేయించుకున్నాడు. అదృష్టవశాత్తూ రిపోర్టు నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
AlsoRead: Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independenceని Indepenceగా రాసి
జ్వర్ంతో పాటు నీరజ్ చోప్రా గొంతు మంటతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. కానీ, అదృష్టమైన వార్త ఏంటంటే... కరోనా టెస్టులో నెగిటివ్ రావడం. డాక్టర్ల సలహా మేరకు నీరజ్ RT-PCR పరీక్ష చేయించుకున్నాడని అతడి సన్నిహితులు తెలిపారు. ఒలింపిక్ పతక విజేతలను ఇటీవల హర్యానా ప్రభుత్వం సన్మానించిన కార్యక్రమానికి నీరజ్ చోప్రా జ్వరంతో బాధపడుతున్నందుకే హాజరుకాలేదని తెలిసింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా జ్వరం నుంచి కోలుకున్నాడని వారు తెలిపారు.
శుక్రవారం నీరజ్ చోప్రా 103 డిగ్రీల జ్వరంతో బాధపడ్డాడు. కానీ, ఇప్పుడు పూర్తిగా జ్వరం నుంచి కోలుకున్నాడు. కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చాక డాక్టర్ల సలహా మేరకు నీరజ్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో అతడు విశ్రాంతి తీసుకోవంతో కోలుకున్నాడు.
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 100ఏళ్ల భారతావని నిరీక్షణకు తెరదించాడు. ఏకంగా స్వర్ణం సాధించి భారతీయుల కలను నెరవేర్చాడు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు పతకం గెలిచింది.
AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి భారత్ వచ్చినప్పటి నుంచి నీరజ్ చోప్రా పూర్తిగా బిజీగా గడుపుతున్నాడు. పలువురు కేంద్ర మంత్రులను కలవడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో విశ్రాంతి లేదు. దీంతో అతడు పూర్తిగా అలసిపోయాడని, ఆ కారణంగానే అతడు సిక్ (sick) అయ్యాడని తెలుస్తోంది.