Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independence‌ని Indepenceగా రాసి

పాకిస్థాన్ క్రికెటర్లు అప్పుడప్పుడూ తమ ఇంగ్లీష్ పరిజ్ఞానంతో నవ్వులపాలవుతూ ఉంటారు. తాజాగా ఆ దేశ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన ఇంగ్లీష్ పరిజ్ఞానంతో నెటిజన్ల చేతికి చిక్కాడు.

Continues below advertisement

AlsoRead: IPL 2021: దుబాయ్‌కి వణక్కం... UAE చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్... కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వచ్చిన ధోనీ

దీంతో తన తప్పిదాన్ని గ్రహించిన కమ్రాన్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ సారి కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్‌గానే రాశాడు. పాకిస్థాన్‌కి చెందిన 39 ఏళ్ల కమ్రాన్ అక్మల్ తనకి వచ్చీరాని ఇంగ్లీష్‌తో ఇటీవల నెటిజన్ల ట్రోల్స్‌కి గురవుతూనే ఉన్నాడు. 

AlsoRead: IND vs ENG 2nd Test Score Live: 300 మార్కును అందుకున్న ఇంగ్లాండ్... కొనసాగుతోన్న జో రూట్ ఇన్నింగ్స్

కమ్రాన్ అక్మల్ సోదరుడు ఉమర్ అక్మల్ కూడా గతంలో ఇలాగే నెటిజన్ల ట్రోల్స్‌కి గురయ్యాడు. 2019లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్ధుల్ రజాక్‌తో కలిసి పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు విమానంలో యూఏఈకి వెళ్లే సమయంలో అతడితో కలిసి సెల్ఫీ తీసుకుని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఫొటోకి అతడు ‘Mother from another brother’అని రాసుకొచ్చాడు. నెటిజన్లు ట్రోల్ చేయడంతో వెంటనే గ్రహించి తప్పిదాన్ని సరిచేసుకున్నాడు. ఆ ట్వీట్‌ని డిలీట్ చేసి Brother from another mother అని రాసుకొచ్చాడు. కానీ.. అప్పటికే ఆ ట్వీట్ వైరలయ్యింది. 

Continues below advertisement
Sponsored Links by Taboola