IND vs ENG 2nd Test Score Live: ముగిసిన మూడో రోజు ఆట... 27 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్... 180 పరుగులతో అజేయంగా నిలిచిన జో రూట్

రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ 27 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ABP Desam Last Updated: 14 Aug 2021 11:08 PM

Background

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 119/3తో ఉంది. రూట్‌(48*), బెయిర్‌ స్టో (6*) క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మూడో రోజు ఆట బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ కాస్త దూకుడుగా ఆడుతోంది. టీమ్‌ఇండియా వీలైనంత త్వరగా వికెట్లు తీయాలని...More

27 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 128 ఓవర్లకు ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 180(321బంతులు, 18 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచాడు.