IPL-2021 రెండో దశ కోసం ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్ చేరుకుంది. ఇక అభిమానులకు IPL సందడి మొదలైనట్లే. UAE వేదికగా ఈ ఏడాది రెండో సీజన్ ఐపీఎల్ దుబాయ్‌లో జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది IPL మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి వేదిక యూఈఏకి మారడంతో ఫ్రాంచైజీలన్నీ అక్కడ ఆటగాళ్ల కోసం ముందస్తు ఏర్పాట్లు చేశాయి.
AlsoRead: IPL 2021: శ్రేయస్ అయ్యర్ ఆగయా... ఇక బ్యాట్ మాట్లాడుతుందంటూ ట్వీట్
మూడుసార్లు IPL టోర్నీ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ శుక్రవారం రాత్రి దుబాయ్ చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, చిన్న తలా సురేశ్ రైనా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, జట్టు సహాయ సిబ్బంది దుబాయ్ చేరుకున్నారు. పలువురి క్రికెటర్ల కుటుంబసభ్యులతో సహా దుబాయ్ వచ్చారు. ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్న సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘దుబాయ్‌కి మరోసారి వణక్కం’ అంటూ జతచేసిన వీడియోలో సీఎస్‌కే బస చేస్తున్న హోటల్, ఎంటర్‌టైన్‌మెంట్ గదిని చూపించారు.
దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న రెండో దశ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ X ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. CSK సహాయ కోచ్‌లైన లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ సహా ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లు పలువురు కరోనా వైరస్ బారిన పడటంతో సీజన్‌ను అర్థంతరంగా ఆపేశారు. గత ఏడాది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో నిలిచిన చెన్నై ఈ సారి ట్రోఫీపై కన్నేసింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు గెలిచి రెండింట్లో ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నారు. మరి, ఈ ఏడాది ధోనీ సేన ట్రోఫీ గెలుస్తుందో లేదో చూడాలి.
AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్