లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం క్రీజులో ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కోహ్లీ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అండర్సన్ తన నోటికి పని చెప్పాడు. తొలుత నోరు జారిన అండర్సన్ పై .. విరాట్ కోహ్లీ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్ మౌనంగా ఉండటం గమనార్హం.
Also Read: BCCI on MS Dhoni: మహేంద్రుడి రిటైర్మెంట్... అప్పుడే ఏడాదైపోయిందా అని బీసీసీఐ ఆసక్తికర ట్వీట్
అసలేం జరిగిందంటే...
ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో మొదటి బంతిని విరాట్ కోహ్లీ బౌండరీ బాదాడు. అండర్సన్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని కోహ్లీ ఫోర్‌గా మలిచాడు. దీంతో జేమ్స్ అండర్సన్ నోరు జారాడు. గమనించిన కోహ్లీ... అదే ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్లిన కోహ్లీ.. అండర్సన్‌కి తనదైన స్టైల్లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
Also Read: IND vs END: బ్యాడ్ లైట్ కారణంగా... అరగంట ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట... భారత్ 181/6
వాస్తవానికి విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడే ప్రారంభంకాలేదు. 2014 నుంచి కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన విరాట్ కోహ్లీని అండర్సన్ ఏకంగా నాలుగు సార్లు ఔట్ చేశాడు. 2018లో ఆ తప్పిదాల్ని దిద్దుకున్న కోహ్లీ ఐదు టెస్టుల్లో ఒక్కసారి కూడా అండర్సన్ చేతికి చిక్కలేదు. ఆ పర్యటనలో కోహ్లీ 593 పరుగులతో సత్తాచాటాడు.
Also Read: IND vs END: లండన్‌లో కోహ్లీ సేన స్వాతంత్య్ర వేడుకలు... జెండా ఎగురవేసిన కోహ్లీ
ప్రస్తుతం 5 టెస్టుల కోసం భారత్... ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ... అండర్సన్ చేతికే చిక్కాడు. అండర్సన్ బౌలింగ్‌లోనే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో పాత మెమరీస్‌ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అండర్సన్ టార్గెట్ కోహ్లీనే అని అభిమానులు అనుకుంటున్నారు.
AlsoRead: Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independenceని Indepenceగా రాసి