యాంకర్ శ్రీముఖి గురించి తెలియనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఆమె బుల్లి తెరపై కనిపించినా లేకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ‘పటాస్’ కార్యక్రమంతో మంచి యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం ఏర్పరుచుకుంది. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్ట్స్’లో శ్రీముఖీ యాంకరింగ్ చేస్తూ అలరిస్తోంది. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శ్రీముఖి ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుల్లితెర పరిశ్రమలో తనకు ఎదురైన సవాళ్లు గురించి చెప్పుకొచ్చింది.
యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి సమాధానమిస్తూ.. ‘‘వరుస షోలతో చాలా ఇబ్బందిగా ఉండేది. దీంతో మా నాన్నగారికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి.. నేను ఈ ఇండస్ట్రీలో ఉండనని చెప్పేశాను. నాకు ఈ ఇండస్ట్రీ వద్దు.. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారని ఏడ్చేశాను. నిద్రపోవడానికి కూడా టైమ్ ఉండేది కాదు. యాంకరింగ్ చేయడానికి రోజంతా నిలబడే ఉండాల్సి వచ్చేది. హీల్స్ వేసుకుని నిలుచోవాలి. ఏది పడితే ఆ డ్రస్ వేసుకోవడానికి కుదిరేది కాదు. నేను గ్లామరస్ దుస్తులు వేసుకోవాలని డైరెక్టర్లు ఎక్స్‌పెక్ట్ చేసేవారు. ‘పటాస్’ కోసం రోజూ రెండు మూడు ఎపిసోడ్లు నిలబడే పనిచేశాను. ఎప్పుడో తప్ప కూర్చోడానికి సమయం దొరికేది కాదు. ‘గోల్డ్ రష్’ ఎపిసోడ్ కూడా రోజుకు నాలుగు, ఐదు ఎపిసోడ్లు చేసేదాన్ని. సుమారు గంట గంటన్నర సేపు నిలబడటం వల్ల కాళ్లు తిమ్మిరెక్కిపోయాయి. అలాంటి సమయంలో గొడ్డు చాకిరీ ఎందుకు చేయాలా అని అనిపించేది. ఆ తర్వాత క్రమేనా నేను చేసే పనిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ప్రేక్షకులకు దగ్గరకావడంతో ఇష్టపడి పనిచేస్తు్న్నా’’ అని తెలిపింది.
ప్రదీప్‌తో ప్రేమ.. పెళ్లిపై వస్తున్న వందతులపై కూడా శ్రీముఖి స్పందించింది. ప్రదీప్‌తో ఏం నడుస్తోంది? అనే ప్రశ్నకు శ్రీముఖి బదులిస్తూ.. ఆ ప్రశ్నను క్వశ్చన్ మార్కుతో వదిలేస్తేనే బెటర్ అని తెలిపింది. ‘‘మేం సుమారు పదేళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నాం. పైగా నేను చేసిన ఫస్ట్ షో ‘అదుర్స్’లో నా కో-యాంకర్ ప్రదీప్. తాజాగా ‘జీ తెలుగు’లో ‘చీ.ల.సౌ శ్రీముఖి, చిరంజీవి ప్రదీప్’ అనే ఈవెంట్ చేశాం. దానివల్ల మా మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. టీవీల్లో కొన్ని జంటలకు ఫాలోయింగ్ ఉంటుంది. ఇది కూడా అంతే. దీని గురించి నేను, ప్రదీప్ కూడా చాలా సార్లు చెప్పాం. అది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేస్తున్నా. మాకైతే దీనిపై క్లారిటీ ఉంది’’ అని శ్రీముఖి తెలిపింది.
Also Read: తన బాధ్యత నాదే.. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అదే, రష్మీ భావోద్వేగం.. సుధీర్ గుడ్ న్యూస్!
Also Read: బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!