75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ వందేమాతరం అనే పాటను రూపొందించారు. ఆ పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు టైగర్ ష్రాఫ్. దీనిపై ట్వీట్ కూడా చేశారు.  టైగర్ చేసిన ప్రయత్నంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. టైగర్ ష్రాఫ్ పోస్టుని ప్రధాని మోడీ రీట్వీట్ కూడా చేశారు. వందేమాతరం గురించి నటుడు చెప్పిన దానిపై తాను ఏకీభవిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.


 





ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టైగర్ ష్రాఫ్ పోస్ట్‌ని రీట్వీట్ చేశారు. 'సృజనాత్మక ప్రయత్నం. వందేమాతరం గురించి మీరు చెప్పే దానితో పూర్తిగా ఏకీభవిస్తాను! ” అని ప్రధాని ట్వీట్ చేశారు.


Also Read: 75th Independence Day: దేశభక్తిని పాట రూపంలో చాటుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.... ఈ దేశం మనందరిదీ అంటూ గీతం రూపకల్పన


శనివారం టైగర్ ష్రాఫ్ వందేమాతరం గురించి చేసిన వీడియోను ట్వీట్ చేశారు.  'వందేమాతరం ... ఇవి కేవలం మాటలు కాదు, భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలే మన జాతిని పటిష్టం చేయడానికి దోహదం చేస్తాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిన్న ప్రయత్నాన్ని 130 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నాను' అని టైగర్ ట్వీట్ చేశారు.


 






బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ‘వందేమాతరం’తో తొలిసారిగా పాట పాడారు. ఈ ప్రయత్నంతో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ వీడియోలో టైగర్ తన అద్భుతమైన డ్యాన్స్ కదలికలతో ఆకట్టుకున్నారు. 



ప్రధాని మోదీ ప్రశంసపై టైగర్ ష్రాప్ ట్వీటర్లో కృతజ్ఞతలు తెలిపారు. వందేమాతరం స్ఫూర్తితో స్వాతంత్ర్య వేడుకులు జరుపుకుంటామని, ఈ రోజు దేశానికి ఎంతో ముఖ్యమైందని టైగర్ అన్నారు. 


 






Also Read: Maa Elections 2021: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?