‘జబర్దస్త్’ షో ద్వారా యాంకర్ రష్మీ మంచి పేరునే కాదు.. అభిమానులను కూడా సంపాదించుకుంది. ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్‌కు రష్మీ అంటే ఎంతో అభిమానం. వారిద్దరినీ జంటగా చూడాలనేది వారి కోరిక. అయితే, ఇప్పటివరకు వారు ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని మాత్రమే బయటపెట్టారు. కానీ, పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. సుధీర్‌ టీమ్‌మేట్ ‘ఆటో’ రాంప్రసాద్ కూడా ఇటీవల ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ‘‘నువ్వు రష్మీని పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది’’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. సుధీర్ మాత్రం చిన్న నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు. అయితే, వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ఎపిసోడ్ ప్రోమోలో రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయం మారాయి. 


ఈసారి ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ ఎపిసోడ్ నవ్వులను పంచడమే కాదు. కాస్త భావోద్వేగంగానికి కూడా గురిచేయనుంది. ఎపిసోడ్ చివర్లో యాంకర్ రష్మీ.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పాలని కోరడంతో అంతా ఎమోషనల్ అయ్యారు. నరేష్ నరేష్ మాట్లాడుతూ.. నేను ఎదగడం లేదేమిటీ? నా లైఫ్ ఏమైపోతుందని చాలా చాలా ఏడుపు వచ్చేది అని తెలిపాడు. అలాగే రాకేశ్, భాస్కర్, జీవన్ సైతం మాట్లాడారు. సుధీర్ మాట్లాడుతూ.. ‘‘తొమ్మిదేళ్ల మా ప్రయాణంలో తొలిసారిగా రష్మి నేను కలిసి సినిమా చేసేందుకు స్క్రిప్ట్స్ వింటున్నాం. నా జీవితంలో ఇదో సంతోషకరమైన విషయం’’ అని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.  


చివరిగా రష్మీ మాట్లాడుతూ.. ‘‘నేను మాత్రం తను ఉన్నంత వరకు కేర్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా చాలా హ్యపీ. ఇది నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం’’ అని తెలిపింది. అయితే, ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. ఆ జంటను అభిమానిస్తున్న ప్రేక్షకులు మాత్రం రష్మీ తప్పకుండా సుధీర్ గురించి భావోద్వేగానికి గురైందని అంటున్నారు.


Also Read: బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!


ఇక ఆగస్టు 20న ప్రసారం కానున్న స్కిట్ల విషయానికి వస్తే.. ‘నెల్లూరు కుర్రాళ్లు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాలోని యాక్షన్ సీన్‌ను ఉన్నది ఉన్నట్లుగా దింపేసి మంచి పేరు తెచుకున్న ఈ నెల్లూరు కుర్రాళ్లు.. రాకేష్ స్కిట్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా వారు రాకేశ్‌, రోహిణీలతో ‘వకీల్ సాప్’ స్ఫూఫ్ చేశారు. అలాగే బుల్లెట్ భాస్కర్ టీమ్.. ‘బాహుబలి’ థీమ్‌తో నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో సుధీర్ కట్టప్పగా ఆకట్టుకోనున్నాడు. భాస్కర్ బాహుబలిగా, శివగామిగా శాంతి స్వరూప్, బల్లాలదేవగా ఇమాన్యుయేల్, అవంతికగా ఫైమా, దేవసేనగా మోహన్, వర్ష యువరాణిగా కనిపించాడు. ఇక స్కిట్ విషయానికి వస్తే.. పంచులతో పొట్టచక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమనిపిస్తోంది. ఆ ఎపిసోడ్ ప్రోమోను ఇక్కడ చూసేయండి. 


‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ ప్రోమో:  


Also Read: ఖాకీ వదిలి లుంగీతో పవన్‌ కల్యాణ్ రచ్చ.. క్యాప్షన్‌ అక్కర్లేదంటూ రానాకు వార్నింగ్