సినీ నటి కరాటే కళ్యాణి సహా పలువురు సినీ నటులు తెలంగాణ బీజేపీలో చేరారు. జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉడుమల్ల యాదయ్య, ఇతర పార్టీల నేతలు కూడా ఇదే సమయంలో బీజేపీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. కరాటే కళ్యాణి యాదవ్, జల్ పల్లి కౌన్సిలర్ యాదయ్య సహా పలువురు నాయకులు, జైన్ సమాజ్‌కు చెందిన 200 మంది బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేసే పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం తెలిపారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు నెల చాలా పవిత్రమైనది. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, పంద్రాగస్టు వంటి గొప్ప కార్యక్రమాలు ఈ నెలలోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరపాల్సిందే. ఆ నాడు జరుపుతామని చెప్పి ఈరోజు ఎందుకు యూ టర్న్ తీసుకున్నడో కేసీఆర్ సమాధానమివ్వాలి.’’


Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..


బరాబర్ రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే: బండి సంజయ్
‘‘కేసీఆర్ రాబందు. అలాంటి రాబందు నోట్లో నుండి ‘దళిత బంధు’ మాట వస్తే ఎవరూ నమ్మరు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత మళ్లీ ‘దళిత బంధు’ ఊసే ఉండదు. హుజూర్ నగర్ , నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చాడో ఆ తరువాత వాటిని ఎట్లా మర్చిపోయాడో ప్రజలందరికీ తెలుసు. ఇక అగ్గిపెట్టె మంత్రి హరీష్ రావు నాపై విమర్శలు చేశాడు. నేను దళితులకు రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. దళితులకు నువ్విచ్చే రూ.10 లక్షలు నీ అయ్య సొమ్మా? లేక నోట్లను ముద్రించి ఇస్తున్నవా? దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ  భృతి ఇస్తానని ఏళ్ల నుంచి హామీలిచ్చావు.. గాలికొదిలేసినవు. అవన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ముట్టేవి. మరి ఆ డబ్బులెందుకు ఇయ్యవ్. బరాబర్ ఆ డబ్బులన్నీ దళితులు, పేదలందరికీ ఇవ్వాల్సిందే.’’


Also Read: Independence Day 2021: సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్టైక్స్‌తో వారికి హెచ్చరికలు పంపాం... ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్


‘‘బీజేపీ అంటేనే కేసీఆర్ గజగజ వణికిపోతుండు. ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని ఫలితాలొస్తున్నయ్. అందుకే ఫాంహౌజ్‌లో ఆయనకు నిద్రకూడా పట్టడం లేదు. ఏం చేయాలో తెల్వక చివరకు టీచర్లను కూడా సభకు తరలించే నీచమైన పనికి దిగజారిండు. అసలు కేంద్రం అమలు చేసే సంక్షేమ పథకాలను ఎందుకు రాష్ట్రం అమలు చేయడం లేదు? కేంద్రం నిధులిస్తున్న విషయన్ని ఎందుకు చెప్పట్లేదు. ఎన్నికలొస్తే మాత్రం దళితులు, పేదలు, పథకాలన్నీ కేసీఆర్‌కు గుర్తుకొస్తయ్. ఎన్నికలయ్యాక అవన్నీ గాలికొదిలేసి స్కాంలు చేస్తుంటరు. కేసీఆర్ ఎన్ని వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో గెలిచేది బీజేపీనే. ప్రజలంతా టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులన్నీ తీసుకుని కుటుంబ పాలనను తరిమి తరిమి కొట్టడం ఖాయం.’’


Also Read: 75th Independence day: ఎర్రకోట మీదనే ప్రధాని ఎందుకు జెండా ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత? 


నీరజ్ చోప్రా బల్లెంలా టీఆర్ఎస్‌ను విసిరిపారేయాలి: బండి
2023లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే. టీఆర్ఎస్ అరాచక, రాక్షస పాలనను అంతమొందించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తరహాలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బల్లెంలా విసిరి పారేయ్యాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా’’ అని బండి సంజయ్ మాట్లాడారు.


Also Read: గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా వందనం హెలెట్స్