టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2020 ఆగస్టు 15వ తేదీ రాత్రి గం.7.29 నిమిషాలకు మహేంద్రుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ధోనీ నిర్ణయంతో అనుమానులు షాక్ కు గురయ్యారు. 'నా కెరీర్ సాంతం నన్ను ఎంతగానో అభిమానించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.19.29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ధోనీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
అప్పుడే ఏడాదైందా....
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘నాయకుడు, దిగ్గజం, స్ఫూర్తిదాయకుడు’ అంటూ ధోనీ ఫొటోని ట్వీట్ చేసింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అప్పుడే ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ, ధోనీ సాధించిన ఘనతలను తెలియజేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్వీట్ చేసింది.
Also Read: IND vs END: లండన్‌లో కోహ్లీ సేన స్వాతంత్య్ర వేడుకలు... జెండా ఎగురవేసిన కోహ్లీ
ఆ రనౌట్....
కెప్టెన్ కూల్ గా పేరు పొందిన మహేంద్రుడు భారత్ కు ఎన్నో ఘన విజయాలనందించాడు. 2007 T20 ప్రపంచకప్, 2010, 2016 ఆసియా కప్‌లు, 2011 ప్రపంచకప్‌తో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు ధోనీ సారథ్యంలో టీమ్ ఇండియా గెలుచుకుంది. 2019 ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ధోనీకి చివరి మ్యాచ్. రనౌట్ తో కెరీర్ ప్రారంభించిన ధోనీ రనౌట్ తోనే కెరీర్ ముగించాడు.
Also Read: Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independenceని Indepenceగా రాసి
ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్
2004లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన ధోనీ...మొత్తం 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు ఉన్నాయి. ఎంట్రీలోనే పవర్ హిట్టర్ గా పేరుతెచ్చుకున్న ధోనీ... హెలికాఫ్టర్ షాట్ తో క్రికెట్ ప్రేమికుల్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్‌గానూ మహేంద్రుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.
Also Read: PV Sindhu at Tirupati Temple: యువక్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తా…తిరుమలలో పీవీ సింధు