టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక ఖాయమే! రెండేళ్ల కాలానికి అతడితో బీసీసీఐ ఒప్పందం చేసుకుంటుందని తెలిసింది. ఎవరూ ఊహించలేనంత వేతనం ఇవ్వబోతోందని సమాచారం. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పోలిస్తే 'మిస్టర్‌ డిపెండబుల్‌'కు రెట్టింపు వేతనం ఇస్తున్నారట.


Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?


కోచ్‌ రవిశాస్త్రికి ఏటా రూ.5.5 కోట్లు ఇస్తున్నారు. వాటితో పాటు బోనస్‌లు ఉంటాయి. రాహుల్‌ ద్రవిడ్‌కు మాత్రం ఏకంగా రూ.10 కోట్ల వేతనం ఇవ్వనున్నారు. బోనస్‌తో పాటు అతడికి మరికొన్ని ప్రయోజనాలనూ కల్పించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోచ్‌లతో పోల్చినా ద్రవిడ్‌కు ఎక్కువే ఇస్తున్నట్టు అర్థమవుతోంది. ఐసీసీ ట్రోఫీల్లో టీమ్‌ఇండియా స్థిరంగా రాణించడమే లక్ష్యంగా ద్రవిడ్‌ను నియమించనున్నారు.


Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌


వాస్తవంగా పూర్తి స్థాయి కోచ్‌గా ఉండేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించలేదు! మీడియా సమావేశాల్లోనూ ఇలాగే సూచనలు చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జేషా మాత్రం కోచ్‌గా ద్రవిడ్‌ మాత్రమే ఉండాలని పట్టుబట్టారట. ఎన్నోసార్లు చర్చించి అతడిని ఒప్పించారని తెలిసింది.


Also Read: ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్‌ మహీంద్రా


టీమ్‌ఇండియా తర్వాతి కోచ్‌గా ద్రవిడ్‌ ఎంపికవుతారని శనివారం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 'రాహుల్‌ ద్రవిడ్‌తో గంగూలీ, జేషా తీవ్రంగా చర్చించారు. అతడిని ఒప్పించారు. ఇందుకు చాలా సమయమే పట్టింది. భారత క్రికెట్‌ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి చివరికి అంగీకరించారు. అతడు కుర్రాళ్లకు సరైన మార్గనిర్దేశం చేయగలరు. ద్రవిడ్‌ ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడాల్సింది విక్రమ్‌ రాఠోడ్‌ స్థానం గురించే. ప్రస్తుతం భారత క్రికెట్‌ పరివర్తన దశలో ఉంది. కుర్రాళ్లు వస్తున్నారు. వారితో ద్రవిడ్‌కు అనుబంధం ఉంది. కాబట్టి ప్రపంచ జట్లను ఓడించేందుకు అతడి కోచింగ్‌, మెంటార్‌షిప్‌ ఉపయోగపడుతుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


Also Read: ఎందుకు 'డాడీస్‌ ఆర్మీ'నే గెలుస్తుంది? ఏంటీ వీళ్ల గొప్ప? ధోనీ ఒక్కడుంటే చాలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి