ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతిపెద్ద పోరుకు వేళైంది. అక్టోబర్ 24న భారత్, పాక్ తొలి మ్యాచులో తలపడుతున్నాయి. ఈ జట్లు తలపడే ప్రతిసారీ వారి బలబలాలపై విపరీతమైన చర్చ సాగుతుంటుంది.
స్టార్ ఆటగాళ్లపై అంచనాలు భారీగా ఉంటాయి. ప్రపంచ క్రికెట్లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. అయితే అతడి కన్నా తమ బాబర్ ఆజామే అద్భుతమైన ఆటగాడని పాక్ అభిమానులు అంటుంటారు. మరి వీరిద్దరిలో ఎవరు మేటి? ఎవరి గణాంకాలు ఏంటి? ఎవరి బలం ఏంటి? చూద్దామా!!
అంతర్జాతీయ టీ20లు
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 90 టీ20లు ఆడాడు. 24 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 52.65 సగటు, 139 స్ట్రైక్‌రేట్‌తో 3,159 పరుగులు చేశాడు. 28 అర్ధశతకాలు సాధించాడు. 285 బౌండరీలు, 90 సిక్సర్లు దంచాడు.
బాబర్ ఆజామ్: మొత్తం 56 టీ20లు ఆడాడు. 9సార్లు నాటౌట్‌గా నిలిచాడు. సగటు 46.89 కాగా స్ట్రైక్‌రేట్ 130గా ఉంది. మొత్తం 2204 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 20 అర్ధశతకాలు, 231 బౌండరీలు, 33 సిక్సర్లు దంచాడు.
ప్రస్తుత సీజన్లో ఫామ్
2020/21 సీజన్లో 8 టీ20లు ఆడిన విరాట్ 73 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 365 పరుగులు చేశాడు. నాలుగు అర్ధశతకాలు సాధించాడు. 2021లో 14 మ్యాచులు ఆడిన బాబర్ 43 సగటు, 132 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.
కెప్టెన్సీ రికార్డులు
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 45 మ్యాచుల్లో 48.45 సగటు, 143 స్ట్రైక్‌రేట్‌తో 1502 పరుగులు చేశాడు. 12 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే 29 గెలిచి 14 మ్యాచుల్లో ఓడిపోయాడు.
ఇక బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా 28 మ్యాచుల్లో 43 సగటు, 136 స్ట్రైక్‌రేట్‌తో 914 పరుగులు చేశాడు. కాగా అతడి విజయాల రికార్డు 15-8గా ఉంది.
5+ జట్ల టోర్నీల్లో..
ఐదు కన్నా ఎక్కువ జట్లు తలపడే టోర్నీలో విరాట్ కోహ్లీ 21 మ్యాచులు ఆడాడు. 84.54 సగటు, 128 స్ట్రైక్‌రేట్‌తో 930 పరుగులు చేశాడు. ఏకంగా పది అర్ధశతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బాబర్ ఆజామ్ ఐదు జట్ల అంతర్జాతీయ టీ20 టోర్నీల్లో ఆడలేదు.
ప్రత్యర్థిపై అనుభవం
టీ20ల్లో పాక్‌పై ఆడిన అనుభవం కోహ్లీకి ఉంది. పాక్‌పై 6 మ్యాచుల్లో అతడు 84 సగటు, 118 స్ట్రైక్‌రేట్‌తో 254 పరుగులు చేశాడు. అయితే బాబర్ ఆజామ్‌కు మాత్రం పొట్టి క్రికెట్లో టీమ్‌ఇండియాపై అనుభవం లేదు.
యూఏఈలో ఎవరేంటి?
ప్రపంచకప్ జరుగుతున్న యూఏఈలో విరాట్ కోహ్లీ ఐపీఎల్, ఇతర టీ20ల్లో 33 సగటు, 119 స్ట్రైక్‌రేట్‌తో 778 పరుగులు చేశాడు. మొత్తం 28 మ్యాచులు ఆడాడు. పాక్ ఎక్కువ మ్యాచులు యూఏఈలోనే ఆడింది. ఇతర లీగులు, అంతర్జాతీయ టీ20ల్లో ఆజామ్ 53 మ్యాచులు ఆడి 38 సగటు, 115 స్ట్రైక్‌రేట్‌తో 1679 పరుగులు చేశాడు.
డెత్ ఓవర్లలో బ్యాటింగ్ (అంతర్జాతీయ+లీగులు)
విరాట్ 94 టీ20ల్లో డెత్ ఓవర్లలో ఆడాడు. 776 బంతులు ఎదుర్కొని 32 సగటు, 202 స్ట్రైక్‌రేట్‌తో 1575 పరుగులు చేశాడు. ఇక బాబర్ ఆజామ్ 52 మ్యాచుల్లో 373 బంతులు ఎదుర్కొని 20 సగటు, 156 స్ట్రైక్‌రేట్‌తో 584 పరుగులు చేశాడు.
పేస్ బౌలింగ్‌లో బ్యాటింగ్ (అంతర్జాతీయ+లీగులు)
విరాట్ కోహ్లీ పేస్ బౌలింగ్‌లో 4563 బంతులు ఎదుర్కొని 6296 పరుగులు చేశాడు. సగటు 35, స్ట్రైక్‌రేట్ 137గా ఉంది. 175 సార్లు ఔటయ్యాడు. బాబర్ ఆజామ్ 3058 బంతులు ఎదుర్కొని 42 సగటు, 131 స్ట్రైక్‌రేట్‌తో 4030 పరుగులు సాధించాడు. 94 సార్లు ఔటయ్యాడు.
స్పిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ (అంతర్జాతీయ+లీగులు)
విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో 2808 బంతులు ఆడి 57 సగటు, 125 స్ట్రైక్‌రేట్‌తో 3537 పరుగులు చేశాడు. 61 సార్లు ఔటయ్యాడు. ఇక బాబర్ ఆజామ్ 1827 బంతులు ఆడి 51 సగటు, 121 స్ట్రైక్‌రేట్‌తో 2217 పరుగులు చేశాడు. 43 సార్లు ఔటయ్యాడు.
పవర్‌ప్లేలో బ్యాటింగ్ (అంతర్జాతీయ+లీగులు)
విరాట్ కోహ్లీ పవర్‌ప్లేలో 2308 బంతుల్లో 41 సగటు, 115 స్ట్రైక్‌రేట్‌తో 2670 పరుగులు చేశాడు. 64 సార్లు ఔటయ్యాడు. బాబర్ ఆజామ్ 107 ఇన్నింగ్సుల్లో 1321 బంతుల్లో 49 సగటు, 118 స్ట్రైక్‌రేట్‌తో 1569 పరుగులు చేశాడు. 32 సార్లు ఔటయ్యాడు.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ