సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తు.. అందమైన పర్వత ప్రాంతం.. ప్రకృతి రమణీయతను ప్రతిబింబింబే కొండలు.. వాటి మధ్యన అధునాతన హంగులతో నిర్మించిన ఫుట్‌బాల్‌ స్టేడియం! ఎక్కడా అనుకుంటున్నారా!


భారత్‌లోని అత్యంత సుందరమైన స్టేడియాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. లెహ్‌లోని స్పితుకు వద్ద దీనిని నిర్మించారు. ఖేలో ఇండియా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో కొండల మధ్య ఈ ఫుట్‌బాల్‌ మైదానాన్ని నిర్మించారు. జమ్ములోని గ్రామీణ ప్రాంతాల్లోని ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, చిన్నారులకు ఇది ఉపయోగపడనుంది.


ఈ ఫుట్‌బాల్‌ స్టేడియం చిత్రాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'ఇదే సరికొత్త భారతం. ఖేలో ఇండియా క్రీడా మౌలిక సదుపాయాల్లో భాగంగా నిధులు సమకూర్చారు. లెహ్‌లోని స్పితుక్‌లో ఉంది. దాదాపుగా 11,000 అడుగులు ఎత్తులో నిర్మించారు' అని అనురాగ్‌ పోస్టు చేశారు. స్టేడియం ఏరియల్‌ వ్యూ చూసిన వెంటనే నెటిజన్లు ఆనందించారు. అద్భుతంగా ఉందటూ పొగిడేస్తున్నారు.






దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఖేలో ఇండియా ఇన్ఫ్రా పథకాన్ని ఆరంభించింది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో స్టేడియాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా లెహ్‌లో ఫుట్‌బాల్‌ మైదానం నిర్మించారు. మాజీ క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు గతేడాది సెప్టెంబర్లో ఇక్కడ వేర్వేరు సదుపాయాల కోసం శంకు స్థాపన చేశారు. సింథెటిక్‌ ట్రాక్‌, ఆస్ట్రో టర్ఫ్‌ వంటివి ఆరంభించారు.


Also Read: ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్‌ డోన్ట్‌ వర్రీ ప్లీజ్‌!!


Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!


Also Read: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ


Also Read: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!


Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!