Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ జనవరి 31 నుంచి ఆరంభమవుతాయని తెలిసింది. ఈ సారి బడ్జెట్‌ సెషన్‌ రెండు విభాగాలుగా జరుగుతుందని సమాచారం.

Continues below advertisement

ఈ ఏడాది పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ జనవరి 31 నుంచి ఆరంభమవుతాయని తెలిసింది. ఈ సారి బడ్జెట్‌ సెషన్‌ రెండు విభాగాలుగా జరుగుతుందని సమాచారం. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి సెషన్‌, మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో సెషన్‌ జరుగుతుంది.

Continues below advertisement

'2022, జనవరి 31, సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. రాజ్యంగంలోని 87(I) ప్రకారం పార్లమెంటు ఎందుకు సమావేశం అవుతుందో సమాచారం ఇస్తారు' అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ సెషన్లను రెండు భాగాలుగా ఎందుకు నిర్వహిస్తున్నారో పార్లమెంటరీ వ్యవహారాలపై వేసిన కేబినెట్‌ కమిటీ వివరించనుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటులోని 402 మంది ఉద్యోగులకు కొవిడ్‌ సోకిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో మొత్తం 1409 మంది పనిచేస్తున్నారు. వారికి జనవరి 4 నుంచి 8 వరకు చేసిన పరీక్షల్లో 402 మందికి వైరస్‌ సోకినట్టు తెలిసింది. ఏ వేరియెంట్‌ వచ్చిందో తెలుసుకొనేందుకు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వైరస్‌ కారణంగానే ఈ సారి బడ్జెట్‌ సెషన్‌ను రెండు దఫాలుగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021, డిసెంబర్‌ 31న విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఏటా బడ్జెట్‌కు ముందు ఇలాంటి సమావేశం నిర్వహించడం సంప్రదాయం.

Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!

Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు

Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!

Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!

Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!

Continues below advertisement
Sponsored Links by Taboola