కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది టీమిండియా. ఐదో రోజు ఆట మొదట్లోనే న్యూజిలాండ్ బ్యాటర్ సోమర్ విల్లే ఇచ్చిన క్యాచ్‌ను చతేశ్వర్ పుజారా నేలపాలు చేశాడు. ఆ తర్వాత కివీస్ ఆటగాళ్లు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు.
284 పరుగులు ఛేదించే లక్ష్యంతో కివీస్ చాలా నింపాదిగా ఆడుతోంది. లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 79పరుగులు చేసింది. సోమర్ విల్లే, టామ్ లాథమ్ భారత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.
మూడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట స్టార్ట్ చేసిన కివీస్ బ్యాట్స్‌మెన్ మొదటి సెషన్‌లో 76 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 205 పరుగులు చేయాలి. ఇంకా తొమ్మిది వికెట్లు ఆ టీం చేతిలో ఉన్నాయి.
టీమిండియా ఐదో రోజు మొదటి సెషన్‌లో 31ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. ఇంకా రెండు సెషన్స్ మిగిలి ఉన్నాయి. భారత్ వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. లేకుంటే డ్రాగా మ్యాచ్ ముగుస్తుంది.
వికెట్ల కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. కెప్టెన్ రహానె... బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నాడు. రకరకాల కాంబినేషన్‌లో కివీస్ బ్యాట్సర్లను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాడు. అయినా ఎక్కడా ఛాన్స్ దొరకడం లేదు. మొదట్లో సోమర్ విల్లే ఇచ్చిన క్యాచ్‌ను ఛతేశ్వర్ పుజారా వదిలివేశాడు. ఆ ఒక్కటి మినహా ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా న్యూజిలాండ్ బ్యాటర్లు భారత్ బౌలర్లతో ఆడుకుంటున్నారు.
నాల్గో రోజు భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లర్ చేసిన తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అదే ఊపు ఐదో రోజు కొనసాగుతుంది టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడ్డారు. కానీ అన్ని రకాల బౌలింగ్‌ను కివీస్ ధీటుగా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం లాథమ్ 35, సోమర్ విల్లే 36పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి