IPL Auction 2025 LIVE: ఐపీఎల్ 2025 మెగా వేలం, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్

IPL Auction 2025 LIVE Updates: ఐపీఎల్ మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. హాట్ ఫెవరెట్స్ వీరే

Shankar Dukanam Last Updated: 24 Nov 2024 07:07 PM
ఐపీఎల్ వేలం - రవిచంద్ర అశ్విన్‌ను దక్కించుకున్న సీఎస్కే

IPL Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో రవిచంద్ర అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్‌ను సన్ రైజర్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్‌ను ఢిల్లీ ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించి సొంతం చేసుకుంది. రాహుల్ త్రిపాఠీని చెన్నై రూ.3.40 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డేవాన్ కాన్వేను రూ.6.25 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. లఖ్‌నవూ మార్‌క్రమ్‌ను రూ.2 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకూ అమ్ముడిపోయిన ఆటగాళ్లు వీరే

IPL Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో ఇప్పటివరకూ అమ్ముడుపోయిన ఆటగాళ్లు..



  • శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్) - రూ.26.75 కోట్లు

  • అర్షదీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) - రూ.18 కోట్లు

  • కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్) - రూ.10.75 కోట్లు

  • జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్) - రూ.15.75 కోట్లు

  • మహ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్) - రూ.12.25 కోట్లు

  • మిచెల్ స్టార్క్ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ.11.75 కోట్లు

  • రిషభ్ పంత్ (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్) - రూ.27 కోట్లు

  • మహ్మద్ షమి (ఎస్ఆర్‌హెచ్) - రూ.10 కోట్లు

  • డేవిడ్ మిల్లర్ (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్) - రూ.7.5 కోట్లు

  • యుజ్వేంద్ర చాహల్ (పంజాబ్ కింగ్స్) - రూ.18 కోట్లు

  • కేఎల్ రాహుల్ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ.14 కోట్లు

  • లియామ్ లివింగ్ స్టోన్ (ఆర్‌సీబీ) - రూ.8.75 కోట్లు

IPL 2025 Mega Auction Live Updates: కేఎల్ రాహుల్ - రూ.14 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ రిషభత్ పంత్ ను వదులుకున్న  ఢిల్లీ రాహుల్ ను తీసుకుంది.

లియాన్ లివింగ్ స్టన్ - రూ.8.75 కోట్లు, ఆర్సీబీ

లియాన్ లివింగ్ స్టన్ - రూ.8.75 కోట్లు, ఆర్సీబీ

IPL 2025 Mega Auction Live Updates: మహ్మద్ సిరాజ్ - 12.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్

IPL 2025 Mega Auction Live Updates:  గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు పేసర్ మహ్మద్ సిరాజ్ ను తీసుకుంది.

IPL 2025 Mega Auction Live Updates: యుజువేంద్ర చాహల్ - రూ. 18 కోట్లు, పంజాబ్ కింగ్స్

IPL 2025 Mega Auction Live Updates:  పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల ధరకు యుజువేంద్ర చాహల్ ను సొంతం చేసుకుంది. 15 కోట్ల వరకు పోటీ పడినా, తరువాత కొన్ని ఫ్రాంచైజీలు వెనక్కి తగ్గాయి.

IPL 2025 Mega Auction Live Updates: డేవిడ్ మిల్లర్ - రూ. 7.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ మిల్లర్ ను రూ. 7.5 కోట్లకు వేలంలో దక్కించుకుంది. 

IPL 2025 Mega Auction Live Updates: రూ.10 కోట్లకు మహ్మద్ షమీని తీసుకున్న సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్మ హ్మద్ షమీ - రూ.10 కోట్లకు దక్కించుకుంది. పాత జట్టు రైట్ టు మ్యాచ్ వాడకపోవడంతో సన్ రైజర్స్ షమీని తీసుకుంది.

IPL 2025 Mega Auction Live Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. రూ.27 కోట్లు చెల్లించి లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ను దక్కించుకుంది. పంత్ ను ఢిల్లీ తిరిగి తీసుకుంటుందని అంతా ఊహించారు, కానీ లక్నో రేసులోకి వచ్చి భారీ ధర పెట్టడంతో సీన్ మారిపోయింది. శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్ల రికార్డును కేవలం గంటలోనే పంత్ అధిగమించాడు.

IPL 2025 Mega Auction Live Updates: ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Mitchell Starc sold for 11.75Cr to Delhi Capitals -  ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను వేలంలో దక్కించుకుంది. 

IPL 2025 Mega Auction Live Updates: జాస్ బట్లర్ - రూ.15.75 కోట్లు గుజరాత్ టైటాన్స్

 గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు ఇంగ్లాండ్ బ్యాటర్ జాస్ బట్లర్ ను తీసుకుంది.

IPL 2025 Mega Auction Live Updates: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన శ్రేయస్ అయ్యర్

IPL 2025 Mega Auction Live Updates: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికాడు. రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. పాట్ కమిన్స్ ధరను అయ్యర్ బీట్ చేశాడు.

IPL 2025 Mega Auction Live Updates: కగిసో రబాడను తీసుకున్న గుజరాత్ టైటాన్స్ 
IPL 2025 Mega Auction Live Updates: రూ.18 కోట్లకు పేసర్ అర్షదీప్ సింగ్ ను తీసుకున్న పంజాబ్ కింగ్స్

IPL 2025 Mega Auction Live Updates: పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు పేసర్ అర్షదీప్ సింగ్ ను తీసుకుంది. వేలంలో రూ.15.75 మొత్తం పలికిన ధరకు సన్ రైజర్స్ తీసుకునేందుకు చూసింది. తరువాత రూ.18 కోట్లకు బిడ్ వేసింది. కానీ అదే మొత్తానికి పంజాబ్ కింగ్స్ అర్షదీప్ ను దక్కించుకుంది.

IPL 2025 Mega Auction Live Updates: రాజస్థాన్ వద్ద రూ.41 కోట్లు, పంజాబ్ కింగ్స్ రూ.110.5 కోట్లు

IPL 2025 వేలంలో అత్యల్పంగా 41 కోట్లతో రాజస్థాన్ రాయల్స్, అత్యధికంగా 110.5 కోట్లతో పంజాబ్ కింగ్స్ వద్ద ఉన్నాయి


- పంజాబ్ కింగ్స్: 110.5 CR
- ఆర్సీబీ: 83 Cr
- ఢిల్లీ క్యాపిటల్స్ : 73 Cr
- లక్నో: 69 Cr
- గుజరాత్ : 69 Cr
- చెన్నై : 55 Cr
- కోల్ కతా: 51 Cr
- ముంబై: 45 Cr
- సన్ రైజర్స్: 45 Cr
- రాజస్థాన్: 41 Cr

IPL Auction 2025 LIVE Updates: వేలంలో క్యాప్డ్ ప్లేయర్స్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఎంత మంది

- క్యాప్డ్ ప్లేయర్లు ఇండియన్స్ (48 మంది)
- అంతర్జాతీయ ఆటగాళ్లు (272 మంది)
- గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు (152 మంది)
- గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ (ముగ్గురు)
- అన్‌క్యాప్డ్ ఇండియన్స్ (965 మంది ఆటగాళ్లు)
- అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు (104 మంది)

IPL Auction 2025 LIVE Updates: IPL 2025 మెగా వేలం లైవ్ ఎక్కడ చూడాలంటే

ఐపీఎల్ 2025 మెగా వేలం ఈవెంట్‌ను జియో సినిమా యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ఛానల్ లో సైతం చూడవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

IPL Auction 2025 LIVE Updates: విదేశీ ఆటగాళ్లలో హాట్ ఫెవరెట్స్ వీరే

విదేశీ ఆటగాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, కగిసో రబడలపై అందరి చూపు నెలకొంది. వీరికి వేలంలో అత్యధిక రేటు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. 

IPL Auction 2025 LIVE Updates: అందరి కళ్లూ రిషబ్ పంత్ మీదే

ఐపీఎల్ 2025 వేలంలో అందరి కళ్లూ రిషబ్ పంత్ మీదే ఉంటాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ లను సైతం తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. 

Background

IPL Mega Auction 2025 Date and Time | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో 2 రోజులపాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ (IPL 2024 Meaga Auction) నిర్వహిస్తున్నారు. గతంలో దుబాయ్‌లో అనంతరం విదేశాలలో ఐపీఎల్ చరిత్రలో వేలం నిర్వహించనుండటం ఇది కేవలం రెండోసారి. ఈ మెగా వేలంలో వచ్చే మూడేళ్లకుగానూ 2027 వరకు 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకోనున్నాయి. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.


ఐపీఎల్ 2025 మెగా వేలంలో అందరి కళ్లూ రిషబ్ పంత్ మీదే ఉంటాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ లను సైతం తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో మిచెల్ స్టార్క్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్, కగిసో రబడలపై అందరి చూపు నెలకొంది. వీరికి వేలంలో అత్యధిక ధరలు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా 25 మంది ఆటగాళ్లతో  స్క్వాడ్‌ కంప్లీట్ చేయాలి. మొత్తం 204 మంది ఆటగాళ్లను TATA IPL 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. 


ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.