Airlines Plane Crash: కజకిస్తాన్‌లోని అక్టౌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. గురైంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలలో, విమానం భాగాలు ఎగిరిపోవడం, దాని భాగాలు భూమిపై చాలా దూరంగా చెల్లాచెదురుగా కనిపించడం చూడవచ్చు. పక్షులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ కరస్పాండెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టౌ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయబోతుండగా, ఓ పక్షుల గుంపు, విమానం ఇంజిన్‌ను ఢీకొట్టడంతో ఆక్సిజన్ సిలిండర్ పగిలిపోయింది. ప్రమాదానికి ముందు కొంత మంది ప్రయాణికులు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.
విమానం ఒక్కసారిగా పక్షుల గుంపును ఢీకొనడం, స్టీరింగ్ వైఫల్యం కారణంగా ప్రమాదానికి ముందు సిగ్నల్ ఇచ్చింది. విమానం వేగం, ఎత్తును పెంచేందుకు పైలట్లు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ విమానం పూర్తిగా అదుపు తప్పింది. ఘటనకు సంబంధించిన వీడియోలో, విమానం పదేపదే పైకి లేవడానికి ప్రయత్నించడం, వేగంగా వెళ్లినా ఆగిపోవడం కనిపించింది. ఎట్టకేలకు పైలట్ విమానాన్ని మరింత ఎత్తుకు వెళ్లి నియంత్రించేందుకు ప్రయత్నించగా.. ఎయిర్‌పోర్టు సమీపంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. చివరికి కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంబ్రేయర్ ఈ190ఏఆర్ విమానంలో రష్యా, అజర్‌బైజాన్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్‌లకు చెందిన 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
వీడియో వైరల్
దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దీన్ని దారి మళ్లించారు. కజికిస్తాన్‌లోని అక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్గటన సంభవించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో అక్టావ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తరువాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. కానీ ప్రమాదం తప్పలేదు. కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే విమానం కుప్పకూలింది. భూమిని తాకిన వెంటనే మంటలు చెలరేగాయి.
ఈ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే దానిపై సమాచారం లేదు. కానీ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న 72 మందీ మరణించి ఉండొచ్చంటూ మరికొందరు అంటున్నారు.
రెండు రోజుల క్రితమే బ్రెజిల్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. టూరిస్ట్ నగరమైన గ్రామడాలో ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఓ వ్యాపారవేత్త విమానం నడుపుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇది ఇళ్లను ఢీకొట్టడడంతో అందులో ఉన్న 10మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం పడిన చోట మరో 15మందికి గాయాలయ్యాయి.
Also Read : Donald Trump: నా ప్రభుత్వంలో వారికి మరణశిక్ష తప్పదు - బైడెన్ ను తప్పుబట్టిన డొనాల్డ్ ట్రంప్