Skywalk at Secunderabad: సికింద్రాబాద్ లో స్కైవాక్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మొబిలిటీ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుడ్ది) ప్రణాళికలను రూపొందించింది. ప్రయాణికులకు, బాటసారులకు సౌకర్యంగా ఉండేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు బస్టాప్లు, టర్మినళ్లు, మెట్రో స్టేషన్లను కలు పుతూ స్కైవాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని వల్ల వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు చేయవచ్చు. సిటీబస్సులు, మెట్రోలు, ప్రధాన రైళ్లలో.. ఇలా ఏ సౌకర్యం ద్వారా ప్రయాణించే వారికైనా ఈ స్కై వాక్ ఉపయోగపడనుంది. హుమ్హా ప్రతిపాదించిన ఈ స్కై వాక్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదిస్తో ఎంతో మందికి ఊరట లభిస్తుంది.
రూ.30 కోట్ల ఖర్చు
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెస్ట్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 800 మీటర్ల స్కైవాక్ నిర్మా ణం చేయనున్నారు. ఇందుకు రూ.30 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా చేస్తున్నారు. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్, రేతిఫైల్ బస్ స్టేషన్, సికింద్రా బాద్ రైల్వేస్టేషన్, గురుద్వార, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో లాంటి ఎన్నో ప్రాంతాలను కలుపుతుంది. ఈ స్కై వాక్ సాయంతో సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగిన వాళ్లు నేరుగా రేతిఫైల్బస్టేషన్ లేదా మెట్రోస్టేషన్కు వెళ్లిపో వచ్చు.
స్కైవాక్ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే..
ప్రస్తుతం మెట్రో ఈస్ట్ స్టేషన్ నుంచి రేతిఫైల్ కు చేరుకొనేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ ఒక స్కైవేను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలోనే రేతిఫైల్ నుంచి మెట్రోకు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధిలో భాగంగా స్టేషన్ నుంచి రేతి ఫైల్ వరకు ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షి ణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్డు మార్గంలో అందుబాటులో ఉన్న స్కైవాక్ వల్ల ప్రతి రోజు వేలాది మంది ఎలాంటి ఇబ్బంది డా రాకపోకలు సాగిస్తున్నారు. అదే తరహాలో సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడం వల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
నగరంలో కొత్తగా స్కైవాక్‌లు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. ముఖ్యంగా పాదాచారుల కోసం పలు కూడళ్లలో స్కైవాక్‌లు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్లలో కొత్తగా స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్టు తెలిపింది.