GT Vs LSG, IPL 2022 Live: బోణీ కొట్టిన గుజరాత్ - లక్నోపై 5 వికెట్లతో ఘనవిజయం - అదరగొట్టిన టెవాటియా!

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

ABP Desam Last Updated: 28 Mar 2022 11:28 PM
బోణీ కొట్టిన గుజరాత్ - లక్నోపై 5 వికెట్లతో ఘనవిజయం - అదరగొట్టిన టెవాటియా!

అవేష్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో 3 ఫోర్లతో రాహుల్ టెవాటియా మ్యాచ్ ను ముగించాడు. 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి గుజరాత్ 161 పరుగులు చేసింది.

18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 139-5

అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. డేవిడ్ మిల్లర్ అవుటయ్యాడు. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 139-5గా ఉంది.

16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 113-4

దీపక్ హుడా వేసిన ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 113-4గా ఉంది.

13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 83-4

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 83-4గా ఉంది. 11వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా, 12వ ఓవర్లో మాథ్యూ వేడ్ అవుటయ్యారు.

10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 72-2

మొహ్ సిన్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 72-2గా ఉంది.

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 44-2

రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 44-2గా ఉంది.

నాలుగో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 35-2

మొహ్ సిన్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 35-2గా ఉంది.

మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 25-2

దుష్మంత చమీర వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. విజయ్ శంకర్ అవుటయ్యాడు. మూడో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 25-2గా ఉంది. 


మాథ్యూ వేడ్ 5(4)
హార్దిక్ పాండ్యా 10(5)
దుష్మంత చమీర 2-0-13-2
విజయ్ శంకర్ (బి) దుష్మంత చమీర (4: 6 బంతుల్లో)

రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 15-1

అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 15-1గా ఉంది. 


మాథ్యూ వేడ్ 5(4)
విజయ్ శంకర్ 4(5)
అవేష్ ఖాన్ 1-0-7-0

లక్నోను ఆదుకున్న హుడా, బదోని - 20 ఓవర్లలో ముగిసేసరికి లక్నో స్కోరు 158-6

వరుణ్ ఆరోన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఆయుష్ బదోని అవుటయ్యాడు. 20వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 158-6గా ఉంది. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 159 పరుగులు కావాలి.


కృనాల్ పాండ్యా 21(13)
దుష్మంత చమీర 1(1)
వరుణ్ ఆరోన్ 4-0-45-2
ఆయుష్ బదోని (సి) హార్దిక్ పాండ్యా (బి) వరుణ్ ఆరోన్ (54: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 149-5

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 149-5గా ఉంది. బదోని అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు,


ఆయుష్ బదోని 53(39)
కృనాల్ పాండ్యా 15(10)
లోకి ఫెర్గూసన్ 4-0-24-0

18 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 139-5

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 139-5గా ఉంది.


ఆయుష్ బదోని 45(35)
కృనాల్ పాండ్యా 13(8)
మహ్మద్ షమీ 4-0-25-3

17 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 124-5

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 17వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 124-5గా ఉంది.


ఆయుష్ బదోని 40(33)
కృనాల్ పాండ్యా 3(4)
లోకి ఫెర్గూసన్ 3-0-14-0

16 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 116-5

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీపక్ హుడా అవుటయ్యాడు. 16వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 116-5గా ఉంది.


ఆయుష్ బదోని 35(30)
కృనాల్ పాండ్యా 0(1)
రషీద్ ఖాన్ 4-0-27-1
దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ (55: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)

15 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 109-4

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 15వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 109-4గా ఉంది.


దీపక్ హుడా 55(40)
ఆయుష్ బదోని 28(26)
హార్దిక్ పాండ్యా 4-0-37-0

14 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 90-4

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 14వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 90-4గా ఉంది. దీపక్ హుడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


దీపక్ హుడా 51(38)
ఆయుష్ బదోని 13(22)
రషీద్ ఖాన్ 3-0-20-0

13 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 80-4

వరుణ్ ఆరోన్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 80-4గా ఉంది.


దీపక్ హుడా 43(34)
ఆయుష్ బదోని 11(20)
వరుణ్ ఆరోన్ 3-0-36-1

12 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 63-4

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 63-4గా ఉంది.


దీపక్ హుడా 27(29)
ఆయుష్ బదోని 10(19)
రషీద్ ఖాన్ 2-0-10-0

11 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 58-4

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 11వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 58-4గా ఉంది.


దీపక్ హుడా 25(27)
ఆయుష్ బదోని 7(15)
హార్దిక్ పాండ్యా 3-0-18-0

10 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 47-4

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 10వ ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 47-4గా ఉంది.


దీపక్ హుడా 15(22)
ఆయుష్ బదోని 6(14)
రషీద్ ఖాన్ 1-0-5-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 42-4

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. తొమ్మిదో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 42-4గా ఉంది.


దీపక్ హుడా 12(18)
ఆయుష్ బదోని 4(12)
హార్దిక్ పాండ్యా 2-0-7-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 36-4

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 36-4గా ఉంది.


దీపక్ హుడా 7(15)
ఆయుష్ బదోని 3(9)
లోకి ఫెర్గూసన్ 2-0-6-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 33-4

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చింది. ఏడో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 33-4గా ఉంది.


దీపక్ హుడా 5(11)
ఆయుష్ బదోని 2(7)
హార్దిక్ పాండ్యా 1-0-1-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 32-4

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 32-4గా ఉంది.


దీపక్ హుడా 5(7)
ఆయుష్ బదోని 1(5)
లోకి ఫెర్గూసన్ 1-0-3-0

ఆగని వికెట్ల పతనం - ఐదు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 29-4

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మనీష్ పాండే అవుటయ్యాడు. ఐదో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 29-4గా ఉంది.


దీపక్ హుడా 4(3)
ఆయుష్ బదోని 0(2)
మహ్మద్ షమీ 3-0-10-3
మనీష్ పాండే (బి) షమీ (6: 5 బంతుల్లో, ఒక ఫోర్)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 26-3

వరుణ్ ఆరోన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఎవిన్ లెవిస్ అవుటయ్యాడు. నాలుగో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 26-3గా ఉంది.


మనీష్ పాండే 6(4)
దీపక్ హుడా 1(1)
వరుణ్ ఆరోన్ 2-0-19-1
ఎవిన్ లెవిస్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) వరుణ్ ఆరోన్ (10: 9 బంతుల్లో, రెండు ఫోర్లు)

ఓపెనర్లిద్దరూ అవుట్ - మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 14-2

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెండో బంతికి క్వింటన్ డికాక్ అవుటయ్యాడు. మూడో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 14-2గా ఉంది.


ఎవిన్ లెవిస్ 6(7)
మనీష్ పాండే 1(1)
మహ్మద్ షమీ 2-0-7-2
క్వింటన్ డికాక్ (బి) షమీ (7: 9 బంతుల్లో, ఒక ఫోర్)

రెండు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 9-1

వరుణ్ ఆరోన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 9-1గా ఉంది.


ఎవిన్ లెవిస్ 6(5)
క్వింటన్ డికాక్ 3(6)
వరుణ్ ఆరోన్ 1-0-7-0

మొదటి బంతికే రాహుల్ అవుట్ - తొలి ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 2-1

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి బంతికే కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 2-1గా ఉంది.


ఎవిన్ లెవిస్ 1(3)
క్వింటన్ డికాక్ 1(2)
మహ్మద్ షమీ 1-0-2-1


కేఎల్ రాహుల్ (సి) మాథ్యూ వేడ్ (బి) షమీ (0: 1 బంతి) 

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లెవిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్‌సిన్ ఖాన్, అయుష్ బదోని, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు ఇదే...

శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, లోకి ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహ్మద్ షమీ

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్. ఐపీఎల్ కెరీర్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే.


పిచ్ ఎలా ఉందంటే?
చెన్నై, కోల్‌కతా తలపడ్డ పిచ్‌నే ఈ మ్యాచ్‌కు కూడా ఉపయోగిస్తున్నారు. 132 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు నష్టపోయి కోల్‌కతా ఛేదించింది. మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు పిచ్ సహకరించనుంది. వాతావరణంలో తేమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు అడ్వాంటేజ్ కానుంది. గత 10 మ్యాచ్‌ల్లో ఆరు సార్లు ఛేదన చేసిన జట్టే విజయం సాధించింది.


గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న హార్దిక్‌కు ఈ మైదానంలో మంచి రికార్డు ఉంది. 28 ఇన్నింగ్స్‌లో 471 పరుగులను హార్దిక్ సాధించాడు. 24 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్‌కు ఈ మైదానంలో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం ఏడు ఇన్నింగ్స్‌లోనే 399 పరుగులను రాహుల్ సాధించాడు. వీటిలో ఒక శతకం, రెండు అర్థ శతకాలు ఉన్నాయి.


ఈ మైదానంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170.4గా ఉంది. ఈ మైదానం మొత్తం 57 వికెట్లు పడ్డాయి. వీటిలో 37 వికెట్లను పేసర్లు దక్కించుకోగా... స్పిన్నర్లకు 13 వికెట్లు దక్కాయి. 2008లో రాజస్తాన్ రాయల్స్... డెక్కన్ చార్జర్స్‌పై 105 పరుగుల తేడాతో ఈ మైదానంలోనే విజయం సాధించింది.


స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు. దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక హాట్ స్టార్ యాప్‌లో హిందీ, ఇంగ్లిష్, బంగ్లా, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, మరాఠీ భాషల్లో కామెంటరీ కూడా అందుబాటులో ఉండనుంది.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.