Flashback 2024: 2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కొత్త హోప్ నింపింది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు సత్తా చాటి, భవిష్యత్తుపై భరోసా పెంచారు. వివిధ దేశాలకు సంబంధించిన అలాంటి ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్నది చూద్దాం. 2024 ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం, క్రికెట్ మైదానంలో ఘనమైన రికార్డులు సృష్టించబడ్డాయి. అనేక మరపురాని మ్యాచ్‌లు కూడా జరిగాయి, వీటిని అభిమానులు సంవత్సరాలుగా గుర్తుంచుకుంటారు. ఇవి కాకుండా పలువురు యువ ఆటగాళ్లు వార్తల్లో నిలిచారు. భారత ఆటగాడు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాకిస్థాన్ ఆటగాడు సైయుమ్ అయూబ్ వంటి యువ బ్యాట్స్‌మెన్లు తమ ప్రదర్శనతో ప్రకంపనలు సృష్టించారు. అయితే, ఈ సంవత్సరం క్రికెట్ మైదానంలో తమదైన ముద్ర వేసిన భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెటర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.


ఈ ఏడాది ఉత్తమ యువ ఆటగాళ్ల జట్టు..
ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత ఆటగాడు అభిషేక్ శర్మతో పాటు పాకిస్థాన్‌కు చెందిన సైయుమ్ అయూబ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. అభిషేక్ ను ఈ జట్టు కెప్టెన్‌గా కూడా పరిగణించవచ్చు. ఆ తర్వాత ఇంగ్లండ్ క్రికెటర్ జాకబ్ బైత్లే వన్ డౌన్‌లో నిలిచాడు. భారత్‌కు చెందిన రియాన్ పరాగ్, పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ గులామ్ వరుసగా నంబర్-4, నంబర్-5లో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో, ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జామీ స్మిత్  ఆరో నంబర్లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సందడి చేసిన నితీష్ కుమార్ రెడ్డిని ఆల్ రౌండర్ కోటాలో చేర్చొచ్చు. ఈ ఆటగాడు ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతకుముందు టీ20ల్లోనూ సందడి చేశాడు.


సూపర్ బౌలర్లు వీళ్లే..
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అల్లా గజన్‌ఫర్, ఇంగ్లండ్‌కు చెందిన విలియం ఓరూర్క్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా, ఇంగ్లిష్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌లకు బౌలర్ల కోటాలో ఈ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులోని భారత ఆటగాళ్లు ముఖ్యంగా, ఐపిఎల్‌లో సందడి చేసిన తర్వాత భారతదేశానికి అరంగేట్రం చేసిన వారే కావడం విశేషం. అభిషేక్ శర్మ ,నితీష్ కుమార్ రెడ్డితోపాటు మెగా టోర్నీలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అభిమానుల దృష్టిని ఆకర్షించిన ర్యాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.


Also Read: Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం


2024 యవ ప్లేయర్ల ప్లేయింగ్ లెవన్:
సైయూమ్ అయూబ్, అభిషేక్ శర్మ (కెప్టెన్), జాకబ్ బైత్లే, ర్యాన్ పరాగ్, కమ్రాన్ గులామ్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అల్లా ఘజన్‌ఫర్, విలియం ఓరూర్క్, క్వేనా మఫాకా , షోయబ్ బషీర్.

Also Read: Viral Photo: శాంటాక్లజ్ వేషంలో ఎంఎస్ ధోనీ.. భార్య, బిడ్డతో క్రిస్మస్ సంబరాలు.. క్షణాల్లో వైరలైన ఫొటో