Andhra couple die by suicide after son refuses to end relationship with transgender : కూతురు వేరే కులం వాడితో లేచిపోయిందని ఆత్మహత్య చేసుకునే తల్లిదండ్రుల్ని చూసి ఉంటాం. కొడుకు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని పరువు తక్కువగా భావించి ఆత్మహత్య చేసుకునే వాళ్ల గురించి వార్తలు చూసి ఉంటాం. అయితే నంద్యాలలో మాత్రం ఓ జంట సూసైడ్ ఇప్పటి వరకూ ఎవరూ విననిది. తన కొడుకు లవ్ చేశాడని ఎంత వద్దన్నా వినడం లేదని.. ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
నంద్యాలలో ఆటోడ్రైవర్ గా సునీల్ అనేయువకుడు పని చేస్తున్నాడు. బీ టెక్ పూర్తి చేసినా ఉద్యోగాల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఆటో నడుపుతున్నాడు. కొడుకు ఇంజనీరింగ్ చేసినా ఆటో నడుపుతున్నాడని ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు.అయితే తనకు ఇదే ఇష్టం అని ఈ పనే చేసుకుంటానని చెబుతూ ఉండేవాడు. దాంతో ఆ తల్లిదండ్రులు వాడి రాత అంతే సర్దుకుపోయారు. అయితే హఠాత్తుగా సునీల్ ప్రేమలో పడ్డాడని తెలిసింది. కానీ ఆ విషయం తెలిసి వారి గుండెలు జారిపోయాయి. ఎందుకంటే సునీల్ ప్రేమలో పడింది అమ్మాయితో కాదు.. ట్రాన్స్ జెండర్ తో. స్మిత అనే ట్రాన్స్ జెండర్ తో సునీల్ కు జరిగిన పరిచయం ప్రేమగా మారింది .
ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకోవడానికి సునీల్ సిద్దమయ్యారు. అయితే ఆ తల్లిదండ్రులు మాత్రం కొడుకు మనసు మార్చేందుకు చాలా ప్రయత్నం చేశారు సమాజంలో చులకన అవుతామని ఎంతో చెప్పి చూశారు. కానీ సునీల్ మాత్రం తన ప్రేమనుఏ మాత్రం తగ్గించుకునేది లేదని తాను స్మితను పెళ్లి చేసుకుని తీరుతానని ప్రకటించారు. దాంతో ఆ తల్లిదండ్రులు.. ట్రాన్స్ జెండర్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లి స్మిత గురించి ఆరా తీశారు. ఆమెకు సంబంధించిన వారితో మాట్లాడారు. అయితే అక్కడా వారికి తిరస్కారమే ఎదురయింది. వారు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుంటారని మధ్యలో అడ్డు రావొద్దని వారు చెప్పి పంపేశారు.
Also Read : వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
తమ కుమారుడు తమ మాట వినడం లేదని.. ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకుంటే ఊళ్లోవాళ్లు అంతా తమను మరో రకంగా చూస్తారన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. చివరికి ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఉరి వేసుకున్నారు. ఈ ఇద్దరి ఆత్మహత్య నంద్యాలలో సంచలనం సృష్టించింది. కుమారుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడని దానికి వీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఎక్కువ మంది నిట్టూరుస్తున్నారు. మొత్తంగానికి ట్రాన్స్ జెండర్ ప్రేమ కారణంగా సునీల్ తన తల్లిదండ్రుల్నికూడా కోల్పోయాడు.
వీరి ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు.