Mumbai Businessman duped Of Rs 7.5 Crore | ముంబయి: సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. గతంలో ఓటీపీలతో లేక మన కార్డులు కొట్టేసి, ఫోన్లో డేటా చోరీ చేసి నేరాలు చేసేవాళ్లు. ఇప్పుడు ఏకంగా సిమ్ స్వాప్ చేసి కోట్లు కొట్టేస్తున్నారు.  తాజాగా ముంబై వ్యాపారవేత్తను ఇదే తీరుగా మోసం చేసిన సైబర్ నేరగాళ్లు రూ.7.5 కోట్లు అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.


ఆ వివరాలిలా ఉన్నాయి..
ముంబయిలోని కందివాలీకి చెందిన ఓ వ్యాపారవేత్త సిమ్ స్వాప్ చేశారు సైబర్ నేరగాళ్లు. అనంతరం బ్యాంకు నుంచి ఓటీపీ వచ్చేలా చేసుకుని నగదు బదిలీ చేసుకున్నారు. వేలు, లక్షలు కాదు ఏకంగా రూ.7.5 కోట్లను వ్యాపారి అకౌట్ నుంచి తమ అకౌంట్లకు సైబర్ నేరగాళ్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అయితే నగదు విత్ డ్రా అవుతున్నట్లు, ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు గుర్తించిన బాధితుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్ లైను 1930కు ఫోన్ చేశారు. తన ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు బదిలీ జరిగిందని ఫిర్యాదు చేశాడు. అలర్ట్ అయిన అధికారులు బ్యాంకుకు సైతం సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల నుంచి  రూ.4.65 కోట్లు మాత్రం సేవ్ చేశారు. మిగిలిన నగదును సైబర్ నేరగాళ్లు అప్పటికే వేరే ఖాతాలకు బదిలీ చేసుకున్నారని సైబర్ సెల్ పేర్కొంది. 


సిమ్ స్వాప్ చేసిన సైబర్ నేరగాళ్లు


సైబర్ నేరగాళ్లు డబ్బున్న సెలబ్రిటీలు, వ్యాపారుల అడ్రఫ్ ప్రూఫ్‌లు సేకరించి ఆ వివరాలతో సిమ్ స్వాప్ చేస్తున్నారు. ముంబై వ్యాపారి విషయంలోనే అదే జరిగింది. వ్యాపారి లాగ బ్యాంకుతో మాట్లాడి ఓటీపీ వచ్చేలా చేసుకుని చాకచక్యంగా నగదు తమ అకౌంట్లకు బదిలీ చేసుకున్నారని సైబర్ నిపుణులు గుర్తించారు. దీనిపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రెగ్యూలర్ నేరాలకు, సైబర్ నేరాలకు వ్యత్యాసం ఉంటుందని.. విచారణ కాస్త భిన్నంగా ఉంటుందన్నారు.


Also Read: Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్