Types of Belly Fat Female : మహిళల్లో బెల్లీ ఫ్యాట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అసలు ఏయే కారణాల వల్ల ఆడవారిలో పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుందో తెలుసా? కారణం ఏదైనా ఆ బెల్లీ ఫ్యాట్​ని తగ్గించుకోవడానికి ఏమి చేయాలి? ఎలాంటి డ్రింక్స్ తాగితే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది? ఆ డ్రింక్స్​ బెల్లీ ఫ్యాట్​పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


స్ట్రెస్/ఒత్తిడి వల్ల పొట్టవస్తే.. 


కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల చాలామందిలో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుంది. ఈ బెల్లీ ఫ్యాట్​ని తగ్గించుకోవడానికి రోజూ గ్రీన్​ టీ తాగితే మంచిది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచడంతో పాటు.. ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. మెరుగైన నిద్రను అందించి కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. 


PCOS వల్ల కలిగే బెల్లీ ఫ్యాట్


మహిళల్లో ప్రధానంగా వచ్చే సమస్యల్లో PCOS ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా విడుదలవుతుంది. హార్మోన్లు డిస్టర్బ్ అయి.. బెల్లీని పెంచుతాయి. దీనిని తగ్గించుకోవాలనుకుంటే దాల్చినచెక్క టీని రోజూ తాగాలి. ఇది హార్మోన్లు బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 


థైరాయిడ్ వల్ల వచ్చే పొట్ట.. 


హార్మోన్ల వల్ల కలిగే సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువైనప్పుడు ఇది వస్తుంది. ఈ సమస్య వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ వచ్చిందనిపిస్తే.. మీరు ధనియాలతో చేసిన టీ తాగవచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ను, మంటను తగ్గించి.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా అదుపులో ఉంచుతాయి. 


మోనోపాజ్​ దశలో వచ్చే బెల్లీ


మోనోపాజ్ వచ్చే సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో మార్పులు రావడంతో పాటు.. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఆ సమయంలో పుదీనాతో చేసే పెప్పర్​మెంట్ టీ తాగితే మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అలాగే మెరుగైన జీర్ణక్రియను అందించి.. పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా హెల్ప్ చేస్తాయి. ఇన్​ఫ్లమేషన్​ను, మంటను కూడా దూరం చేస్తాయి. 


కడుపు ఉబ్బరం


కొందరికి బెల్లీ ఫ్యాట్ ఉండదు. కానీ కడుపు ఉబ్బరం వల్ల పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడమే. డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ తరహా బెల్లీ కనిపిస్తుంది. ఈ రకమైన పొట్టను తగ్గించుకోవడానికి సోంపు గింజలతో చేసిన టీ తాగాలి. దీనిలోని కార్మినేటివ్ లక్షణాలు కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్​ను తగ్గించి.. ఫ్లాట్​ బెల్లీని అందిస్తాయి. 


ఆల్కహాల్ వల్ల కలిగే బెల్లీ


ఆల్కహాల్ తాగేవారిలో శరీరం డీటాక్స్ అవ్వద్దు. దీనివల్ల పొట్ట పెరుగుతుంది. ఇలాంటివారు పొట్టను తగ్గించుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్​ని రెగ్యులర్​గా తాగితే మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలు, లివర్​ను డీటాక్స్ చేసి హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 


ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వీటిని మీరు ప్రారంభించాలనుకునే ముందు.. మీకు వేటివల్ల పొట్ట దగ్గర కొవ్వు వస్తుందో తెలుసుకోండి. కారణాలు గుర్తించి.. వాటికి తగిన డ్రింక్స్ తాగాలనుకుంటే నిపుణుల సలహా తీసుకుని.. ప్రోపర్​గా డైట్​ని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. 



Also Read : పొట్ట తగ్గించుకోవడానికి మగవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. ఈ మార్పులు చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్ బెల్లీ మీ సొంతం