Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శ్రీధర్ కార్తీక్, కాంచనలతో తనకు సారీ చెప్పి తనని వాళ్లతో పాటు ఉండనిస్తే తన దగ్గరున్న డబ్బు మొత్తం కార్తీక్ బిజినెస్‌కి ఇచ్చేస్తా అంటాడు. ఇంత కంటే మంచి ఆఫర్ మీకు రాదు అని అంటాడు. ఇక కాంచన ఆ డబ్బు సంచి తీసుకొని శ్రీధర్‌తో నా ఊపిరి పోయే ఆఖరి క్షణంలో అయినా ఇచ్చిన మాట మీదే ఉంటా కానీ మీతో రాజీ పడను అంటుంది. కార్తీక్‌ని చూపించి వాడే నా ధైర్యం ఆ ధైర్యానికి తోడుగా ఒక నిజాయితీ ఉంది. అదే నా కోడలు దీప అని చెప్తుంది. 


కాంచన: కార్తీక్ కాస్త కారు దాగా సాగనంపురా.
శ్రీధర్: అక్కర్లేదు చేసిన మర్యాద చాలు మొగుడు కాదు సాక్ష్యాత్తు దేవేంద్రుడే వచ్చి వరాలు ఇస్తానన్నా తీరుబాటు లేదు అని చెప్పే రకం వీళ్లు వీళ్లని బాగు చేయడం నా వల్ల కాదు. ఎవరి వల్లా కాదు. పద వీళ్లకి ఆ శివన్నారాయణ గారే కరెక్ట్. 
కార్తీక్: దీప నువ్వు బెడ్ రూం సర్దు నేను పాప నీకు సాయం చేస్తా మళ్లీ దీనికి నిద్ర వస్తే కష్టం.
కాంచన: దీప ఇందేంటి మనసులో పెట్టుకోకు.
అనసూయ: మనసులో అత్తగారు అంటే మీలా ఉండాలి చెల్లమ్మా.
సుమిత్ర: చుట్టాలు ఎవరైనా కష్టాల్లో ఉంటేనే ఎదురెళ్లి సాయం చేస్తారు అలాంటిది ఈ ఇంటి ఆడబిడ్డ కష్టంలో ఉంటే ముద్దు నోట్లోకి ఎలా వెళ్తుందండీ మీకు. గొంతు దగ్గర అడ్డు అనిపించడం లేదా. కట్టు బట్టలతో వెళ్లారు అంటే ఎక్కడికి వెళ్లారో ఎలా ఉన్నారో తిన్నారో లేదో అవేమీ మనకు అవసరం లేదు మన కడుపు నిండితే చాలు. (పారు తప్పా అందరూ తిండి తినకుండా నోటి దగ్గర ముద్దు పక్కనపెట్టేస్తారు) నా వల్ల కావడం లేదండి. 
పారిజాతం: సుమిత్ర తినకుండా దశరథ్ తింటే బాగోదని వెళ్లిపోయాడు మీరు అలా వెళ్లొద్దు.
శివన్నారాయణ: ఇక నాకు చాలు.
జ్యోత్స్న: బావ వెళ్లిపోవడంతో నాకు బాధగా ఉంది గ్రానీ కానీ దీప కోసం వెళ్లాడు కదా అదే కష్టంగా ఉంది.


దీప ఆరు బయట కట్టెల పొయ్యి వెలిగించి వంట చేస్తుంటుంది. కట్టెల పొయ్యికు గొట్టంతో ఊదుతూ దీప ఇబ్బంది పడటం కార్తీక్ చూసి ఫీలవుతాడు. దీప పక్కన కూర్చొని సారీ చెప్తాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అంతకు ముందు నువ్వు అనుభవించిన కష్టాలు పడకుండా గొప్పగా చూసుకోవాలి అనుకున్నా కానీ అవేమీ చేయలేకపోయాను అంటాడు.


దీప: ఇప్పుడు నేను పడుతున్న కష్టం ఒకప్పటి జీవితం అని మీరే అన్నారు. అంటే ఇది నాకు కష్టం కాదు కానీ మీరు అను
భవిస్తున్నారు చూడండి అది కష్టం అంటే మీరు ఎప్పుడూ ఇలా కింద కూర్చొవడం చూడలేదు. కానీ కూర్చొన్నారు చూడండి.  మిమల్ని ఇలా చూడాల్సి వచ్చినందుకు నాకు కష్టంగా ఉంది. గ్యాస్ సిలెండర్ కోసం బాబాయ్‌కి కాల్ చేశా రేపు సెట్ చేస్తా అన్నారు. రెండు రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి.
కార్తీక్: ఎలా సర్దుకుంటాయి ఇంట్లో సరుకులు లేవు బట్టలు లేవు శౌర్యకి మందులు కావాలి. చేతిలో డబ్బులు లేవు ఎవరినీ అడగలేను. ఎవరైనా ఇస్తే తీసుకోలేను. జాబ్ చూసి అడ్వాన్స్ చూసుకోవడానికి అయినా కొంత టైం పడుతుంది కదా. ఆలోపు అయినా ఇళ్లు ఎలా గడవాలి. నా కోసం నాకు బాధ లేదు దీప కానీ మీ గురించే. గ్యాస్ సిలిండర్ వస్తే డబ్బు కట్టాలి కానీ నా దగ్గర డబ్బులేదు లేదంటే నువ్వు ఇలా పొగ గొట్టం పట్టుకొని పొయ్యి ఊదుకుంటూ ఉండాలి.
దీప: ఇప్పటికిప్పుడే ఈ బాధలు అన్నీ పోతే మీరు నవ్వుతారు కదా.
కార్తీక్: ఏ మన పెరట్లో డబ్బులు కాసే చెట్టు ఉందా.
దీప: ఉంది తీసుకొస్తా ఉండండి. అని గతంలో దీప కార్తీక్ బాకీ తీర్చడానికి ఏర్పాటు చేసిన డబ్బా తీసుకొస్తుంది. ఇది గుర్తుందా అని కార్తీక్‌ని అడుగుతుంది. మీకు నేను ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇందులో వేశాను. ఇప్పటికి నేను 36 వేల నాలుగు వందల 50 రూపాయలు పోగేశాను. పెళ్లి తర్వాత హోటల్‌కి వెళ్లడం మానేశాను కదా లేదంటే ఇంకో 10 వేలు పోగేసేదాన్ని అలా అయినా మీ బాకీ తీరదు అనుకోండి. మీ బాకీ తర్వాత తీర్చుతా బాబుగారు ముందు ఈ డబ్బు మన ఖర్చులకు వాడుకుందాం. ఏమంటారు. 
కార్తీక్: ఎమోషనల్ అవుతూ దీప ఈ 36,450 రూపాయలు నాకు ఎంత ధైర్యం ఇచ్చాయో తెలుసా. థ్యాంక్యూ దీప. నువ్వు సొంత ఖర్చులు కూడా మానేసి డబ్బు ఈ డబ్బాలో వేస్తుంటే చాదస్తం అనుకున్నా కానీ నీ పొదుపే ఈరోజు మనకు సాయంగా మిగిలింది.
దీప: ఈ డబ్బులో ఇంటికి సరుకులు మీకు కాంచనమ్మ గారి బట్టలు తీసుకురండి. సరిపోతాయి కదా.
కార్తీక్: సరిపోవడం ఏంటి దీప ఎండిపోయిన పొలంలో వర్షం పడితే ఆ రైతు ఎంత ఆనంద పడతాడో ఈ డబ్బు చూసి నాకు అంత ఆనందం వేసింది. మళ్లీ నెల వరకు మన ఖర్చులకు ఇబ్బంది లేదు ఈలోపు నేను జాబ్ చూసుకుంటా. సంవత్సరం లోపు నేను అనుకున్నది సాధించాలి దీప. ఇదిగో నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే ఎందుకు సాధించను.  
దీప: మనసులో మీ ముఖంలో నవ్వు చూసి నా మనసు నిండిపోయింది కార్తీక్ బాబు మీరు గెలుస్తారు. మిమల్ని గెలిపించడం నా బాధ్యత. మీగెలుపే మీ కుటుంబాలను కలుపుతుంది. 


దీప పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని దాసు ఆలోచిస్తాడు. దీపే వారసురాలు అని తెలిస్తే శివన్నారాయణ ఎలాంటి న్యాయం చేస్తాడో అని భయంగా ఉందనుకుంటాడు.   ఇక స్వప్న శ్రీధర్‌కి కాల్ చేస్తుంది. అన్న రోడ్డున పడటంతో చెల్లి దారిలోకి వచ్చిందని అనుకుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే డాడీ మీకు కొంచెం అయినా బుద్ధి ఉందా అని స్వప్న అడిగితే దానికి శ్రీధర్ ఉంటే నిన్ను ఎందుకు కంటాను అని సెటైర్ వేస్తాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. నిన్ను క్షమించను అని ఒకర్ని ఒకరు అనుకుంటారు. ఇక స్వప్న తండ్రి చేసిన రాద్ధాంతం మామకు చెప్తుంది. ఇక శ్రీధర్, కావేరిల మాటలు కామెడీగా ఉంటాయి. కార్తీక్ ఇంట్లో చాప వేసి అందరి కోసం భోజనాలకు సిద్ధం చేస్తాడు. దీప వంట తీసుకొస్తుంది. డైనింగ్ టేబుల్ లేకుండా ఎలా అని శౌర్య అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్యని దెబ్బకొట్టడానికి క్రిష్ దగ్గర మాట తీసుకున్న మహదేవయ్య.. మామ కాని మామకు MLA టికెట్!