Satyabhama Serial Today Episode మహదేవయ్యకి ఎమ్మెల్యే టికెట్ రావడంతో క్రిష్ నామినేషన్ ఫాం తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో ఒకామె ఏడుస్తూ పెద్దయ్య గారితో మాట్లాడాలి అని వస్తుంది. ఆమె ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నానని ఆ స్థలాన్ని ఒక రాక్షసుడు కబ్జా చేశాడని మీరు తలచుకుంటేనే పని అవుతుందని వాడు కేశవ అని మీ మనిషి అని పార్టీ ఇన్‌ఛార్జీ కొడుకు అని చెప్తుంది.
మహదేవయ్య: మనసులో ఇప్పుడు కానీ వాడి జోలికి పోతే పార్టీ టికెట్ కిందా మీద అవుతుంది.
సత్య: మీ మనిషే అంటున్నారు కదా ఒక్క ఫోన్ చేయండి. వృద్ధులకు సాయం చేసిన వాళ్లు అవుతారు. మీ గురించి గొప్పగా చెప్తారు.
మహదేవయ్య: వాడు నా మనిషే కానీ నా మాట వినే మనిషి కాదమ్మా నువ్వే ఏదో ఒకటి చేసుకో పో.
మహిళ: మీకు దండం పెడతా అయ్యా.
సత్య: అదేంటి మామయ్య మహదేవయ్య అంటే ఎంత పేరున్న మనిషి మీ మాట కూడా వినని వాళ్లు ఉంటారా
మహదేవయ్య: నీకు తెల్వదు ఊరుకో. అనవసరంగా నన్ను ఇరికించకు అసలే ఎలక్షన్ టైం అమ్మా నువ్వు పో.
భైరవి: ఏమ్మా చేయగలిగితే చేసేవారు కదా పోమ్మా పో.
సత్య: రౌడీలు ఆమెని లాక్కెళ్తుంటే. ఆగండి.. ఇక్కడ ఓట్ల లెక్కే కానీ ఎవరికీ మానవత్వం లేదమ్మా.
భైరవి: ఏయ్ ఎవర్ని అంటున్నావే.
సత్య: మానవత్వం లేని వాళ్లని తన కున్న దాంట్లో దిక్కులేని వృద్ధులకు సాయం చేస్తుందీ పెద్దావిడ. తను సమస్యలో ఉండి సాయానికి వస్తే ఇదేనా మీరు ట్రీట్ చేసే విధానం.
మహదేవయ్య: నువ్వు ఈ మేటర్‌లో ఇన్వాల్వ్ అవ్వకు సత్య.
సత్య: అవుతాను మామయ్య. ఆవిడతో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తా.
భైరవి: ఆమె ఇచ్చుకుంటుందిలే సమస్య అవుతుందని మీ మామయ్య చెప్తున్నాడు కదా నువ్వు లోపలికి రా.
సత్య: అవతల ఎంత పెద్ద వాళ్లు ఉన్నారో కూడా నాకు అవసరం లేదు మా మామయ్యకు సమస్య అవుతుందేమో కూడా నాకు అవసరం లేదు అత్తయ్య ఈ పెద్దావిడకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాను.
జయమ్మ: సత్య గొడవలు వద్దు లోపలికి వచ్చేయ్.
భైరవి: ఇంత మంది చెప్తున్నా నీ తలకు ఎక్కడం లేదా ఏంటే నీ మొండి తనం నిన్నూ.
సత్య: ఆగండి అత్తయ్యా తప్పు చేసిన వాడికంటే సరిదిద్ద గల స్థాయిలో ఉండి సాయం చేయని వారిదే అసలు తప్పు.
మహదేవయ్య: భైరవి నువ్వు అడ్డుకోకు. సత్య ఏం చేయాలి అనుకుంటే అది చేయని నోరు పెట్టుకొని అరిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తెలుస్తుంది న్యాయం ఎంత బలహీనంగా ఉంటుందో పోయి రా సత్య. నిన్ను ఎవరూ ఆపరు.
సత్య ఆ మహిళను తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. ఇక సత్య కబ్జా గురించి కేశవ గురించి చెప్తే ఆయన షాక్ అయిపోతాడు. భయంతో నీళ్లు నములుతాడు. వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకొని కాంప్రమైజ్ అవ్వమని అంటాడు. వాళ్లు ఫేక్ డాక్యూమెంట్లు కూడా సిద్ధం చేసుకొని ఉంటారని ఆవిడను వదిలేయమని పోలీస్ అంటాడు. ఈ విషయం ఎక్కడ తేల్చుకోవాలో తెలుసు అని సత్య ఆవిడను తీసుకొని బయటకు వెళ్తుంది. ఆ మహిళ కాంప్రమైజ్ అవుతా అంటే సత్య కోర్టుకి వెళ్దామని అంటుంది. ఆ పెద్దావిడ తనకు తాను సర్దిచెప్పుకుంటే సత్య నేను సాయం చేస్తా మీ కోసం తిరుగుతా పోరాడుతా అని చెప్తుంది. ఇక సత్య తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని పవర్ వస్తే కేశవ లాంటి రౌడీలకు చెక్ పెడతా అంటుంది.
క్రిష్ వెళ్తూ వెళ్తూ నర్శింహను చూసి ఆగి కాకా మా బాబుకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫ్మమ్ అయిపోయిందని సెటైర్లు వేస్తాడు. మా బాపుని నేను గెలిపిస్తానని అంటాడు. మహదేవయ్య ఎమ్మెల్యే అవ్వడం జరగదు అని అంటాడు. దానికి క్రిష్ తన బాపునకు ఎవరు అడ్డు వచ్చినా గెలిపిస్తానని అనుకుంటాడు. ఇక అక్కడ సత్య ఎవరు అడ్డం వచ్చినా నేనే గెలుస్తా అని అంటుంది. మహదేవయ్య కాళ్ల మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతుంటే భైరవి మహదేవయ్యతో చిన్నా గాడు నీ కాళ్ల దగ్గర ఉంటే వాడి పెళ్లాం నీ నెత్తి మీద ఆడుతుంది. అయినా దానికి ఏం అనడం లేదు రోషం పోయిందా నీ పద్ధతి అర్థం కావడం లేదని అంటుంది. సత్య వస్తే దాని సంగతి చూస్తా అని భైరవి అంటే మహదేవయ్య అది నీ సమస్య కాదు వదిలేయ్ నేను చూసుకుంటా అంటాడు. సత్య ఇంటికి రావడంతో భైరవి కోప్పడే సరికి మహదేవయ్య ఆపేసి లోపలికి పంపేస్తాడు. ఎగురు కుంటూ వెళ్లావ్ ఏం చేశావ్ అంటే నాకు పవరు వస్తే అప్పుడు మీ సంగతి చెప్తా అని సత్య అంటుంది.
మహదేవయ్య ఇప్పుడు పూర్తిగా అలర్ట్‌గా ఉన్నాడు నా జోలికి రాలేవు అని పోయి నీ భర్తతో కాపురం చేసుకో అని అంటాడు. సత్య తనతో తాను చెప్తా మీ పని చెప్తా అని అనుకుంటుంది. ఇక సంధ్య పరీక్షలకు చదువుతూ ఉంటుంది. ఇంతలో మైత్రి వచ్చి ఆంటీ లోపలికి రావొచ్చా అని అడుగుతుంది. ఇంతలో హర్ష నందినికి బాక్స్ అడుగుతాడు. మైత్రిని చూసి పలకరిస్తాడు. నందిని హర్షతో ఆఫీస్‌కి టైం అయింది కాదా వెళ్లు అంటే రెండు నిమిషాలు అని మైత్రి ఆపుతుంది. మైత్రి విశ్వనాథం దగ్గరకు వెళ్లి నిస్సహాయ స్థితిలో నాకు ఆశ్రయం ఇచ్చారు. హర్ష నా కోసం చాలా అప్పులు చేసి కష్టపడ్డాడు అని ఇంటి డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఇంటిని అమ్మి నా వల్ల చేసిన అప్పులు తీర్చండి అని అంటుంది. హర్ష తీసుకోవద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యని దెబ్బకొట్టడానికి క్రిష్ దగ్గర మాట తీసుకున్న మహదేవయ్య.. మామ కాని మామకు MLA టికెట్!