Jagadhatri Serial Today Episode: సాధు పంపించిన లోకేషన్ కు వెళ్లి డ్రగ్స్ దందా చేస్తున్న వాళ్లను పట్టుకుంటారు ధాత్రి, కేదార్. రౌడీలను చితక్కొట్టి అమ్మాయిలను సేవ్ చేస్తారు. తర్వాత అమ్మాయిలను మీతో ఎవరు ఈ బిజినెస్ చేయిస్తున్నారని అడుగుతారు. ఎవ్వరూ నోరు విప్పకపోతే.. యామినిని అడుగుతుంది ధాత్రి. దీంతో తనకు ఒక రోజు కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్‌కు వెళ్లానని.. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి స్కానింగ్‌కు పంపిచారు. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్లాను అని యామిని చెప్తుంది. అక్కడ ఒకతను టెస్ట్ చేయడానికి బట్టలు మార్చుకోవడానికి రూంలోకి పంపంచి సీసీ కెమెరాలో వీడియో తీసి నన్ను బెదిరించాడు. అతను చెప్పిన పని నేను చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో నేను ఈ పనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్తుంది యామిని.
యామిని: అలా నాతే మత్తు పదార్థాల బిజినెస్ చేయడానికి ఒప్పించాడు. కొందరిని మత్తు పదార్థాలకు కూడా బానిసల్ని చేసి ఇల్లీగల్ పనులకు వాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్తం కాక ఇలా వాళ్లు చెప్పినట్టు చేస్తున్నాం మేడం.
ధాత్రి: వాడి మొబైల్ నెంబర్ ఉందా..?
యామిని: ఉంది మేడం..
ధాత్రి: అయితే ఒక సారి వాడికి ఫోన్ చేయ్.. కలవాలని చెప్పు..
ల్యాబ్ వ్యక్తి: ఏయ్ ఎవరు..?
యామిని: నేను సార్ యామినిని..
ల్యాబ్ వ్యక్తి: ఏంటి కాల్ చేశావు. నేను చేయకుండా నాకు కాల్ చేయోద్దని చెప్పాను కదా..? ఇంతకీ వెళ్లిన పని అయిపోయిందా..?
యామిని: అయిపోయింది సార్.. నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి
ల్యాబ్ వ్యక్తి: అయితే హాస్పిటల్ కు రా..
ధాత్రి: కేడీ హాస్పిటల్‌కు వెళ్దాం పద..
యామిని: మేడం మళ్లీ ప్రాబ్లం అవుతుందేమో.. అని భయంగా ఉంది.
ధాత్రి: చూస్తుంటే నా చెల్లిలా ఉన్నావు. చూస్తూ నా చెల్లిని ప్రాబ్లెమ్ లో పడేస్తానా..?
అని అందరూ అక్కడి నుంచి హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ ఇంకో అమ్మాయి ఏడుస్తుంటే.. కేదార్ వార్డు బాయ్‌ని బెదిరించగా ఏడుస్తున్న అమ్మాయి వాడు ఇటు వెళ్లాడని చెప్తుంది. ఇంతలో ల్యాబ్ వ్యక్తి తన రూం దగ్గరకు వెళ్లి వీడియోలు అఫ్లోడ్ చేయడానికి ముందు యామినికి ఫోన్ చేసి బెదిరిస్తాడు.
యామిని: మేడం మీరే మా అందరినీ కాపాడాలి మేడం.
ధాత్రి: అన్ని వీడియోలు అప్లోడ్ చేయాలంటే సిస్టం నుంచే చేయాలి. వెంటనే హాస్పిటల్ లో పవర్ ఆఫ్ చేయించండి.
ల్యాబ్ వ్యక్తి: ఇప్పుడే కరెంట్ పోవాలా..? అయితే ఏంటి ఫోన్ లో అప్లోడ్ చేస్తాను.
అని చేయబోతుంటే.. ధాత్రి, కేదార్ ఆ వ్యక్తిని పట్టుకుంటారు. బయటకు తీసుకొచ్చి యామిని చేత చెప్పుతో కొట్టిస్తుంది ధాత్రి. తర్వాత పోలీసులు రాగానే స్టేషన్‌కు తీసుకెళ్తారు. అమ్మాయిలందరినీ ఓదారుస్తుంది.
ధాత్రి: రిలాక్స్ అవండి ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు రానివ్వను. అయినా ఇందులో మీ తప్పు కూడా ఉంది. మీలో ఒక్కరు తిరగబడినా మీ తర్వాతి అమ్మాయిలైన సేఫ్ అయ్యేవారు. మీ లాంటి వారికే గవర్నమెంట్ షీ టీమ్స్ పెట్టింది. ఇలాంటి నీచులను సెల్ఫ్ ప్రొటెక్షన్ పేరుతో మీరు చంపేసినా మీకు శిక్ష కూడా పడదు.
యామిని: థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్.. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను.
కేదార్: వెరీగుడ్ మీ లాగే వాడికి భయపడి ఎంతో మంది అమ్మాయిలు మత్తు పదార్థాల దందాలో ఇరుక్కున్నారు. వాళ్లెవరో ఎక్కడుంటారో మా కన్నా మీకు బాగా తెలుసు రేపు ఈ అడ్రస్‌కు వచ్చి డీటెయిల్స్ ఇవ్వండి.
ధాత్రి: రమ్య వీళ్లను సేఫ్‌గా వాళ్ల వాళ్ల ఇండ్లకు పంపించండి.
అని చెప్పగానే ఇంతలో సాధు ఫోన్ చేస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని చెప్తారు. మరోవైపు ఇంట్లో వైజయంతి, నిషిక, యువరాజ్ కోపంగా ధాత్రి, కేదార్ లను తిడుతుంటారు. అసలు అమ్మ ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం లేదేమోనని యువరాజ్ అంటాడు. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టను అది జగధాత్రి అయినా.. పిన్ని అయినా సరే వదిలిపెట్టేది లేదు అంటుంది కౌషికి. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!