Head Master committed suicide after being cheated by his friends In Anantapur: మనతో బాగా ఉండే వాళ్లంతా మిత్రులు కాదు. మిత్రులుగా ఉండి మోసం చేసేవారు ఎక్కువగా ఉండొచ్చు. వారిని అతిగా నమ్మతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనంతపురంలోని ఈ హెడ్మాస్టర్ కు అదే పరిస్థితి ఏర్పడింది.
షేర్ మార్కెట్ పేరుతో డబ్బులు తీసుకున్న స్నేహితులు
అనంతపురంలో హెడ్మాస్టర్ ఆత్మహత్య ఘటన సంచలనగా మారింది. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి లాభం తిరిగి ఇవ్వలేదంటూ హెడ్మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందర్నీ కలచివేసింది. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో నివాసం ఉండే భాస్కర్ బాబు గత కొంతకాలంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. ఈయన డి హీరే హాల్ మండలం మల్లికేతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను నమ్మి షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు.
Also Read: Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
కంబదూరు కు చెందిన తన స్నేహితులు శ్రీనివాసులు అతని మిత్రుడు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి అనంతపురంలో షేర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ నడుపుతున్నారు. వీటిలో మంచి లాభాలు వస్తాయని భాస్కర్ బాబుకు వెల్లడించారు. స్నేహితులు చెప్పిన దానికి నమ్మిన భాస్కర్ బాబు బ్యాంకులు, యాప్ ల ద్వారా.. మరియు బయట వ్యక్తులతో అప్పు తీసుకొని 60 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీనికి ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం ఇచ్చారు. కొన్ని రోజులు లాభం పేరుతో భాస్కర్ బాబు కి డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడుకు సంబంధించి ఎలాంటి లాభం అసలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. బయట తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోతూ ఉండడంతో మనోవేదనకు గురయ్యాడు. ఎన్నిసార్లు తన మిత్రులను సంప్రదించిన కూడా వారు పట్టించుకోలేదు. E M I లు, బయట వ్యక్తులతో తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో బ్యాంకు సంబంధించిన వ్యక్తులు బయట అప్పులు ఇచ్చిన వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.
అప్పుల బాధ భరించలేక కుడేరు మండలం కమ్మూరు సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అటుగా వెళుతున్న కొందరు స్థానికులు భాస్కర్ బాబును చూసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తన మిత్రులు గాజుల శ్రీనివాసులు, నరేష్ కుమార్ రెడ్డి ల నుంచి 60 లక్షలు ఇప్పించి తన కుటుంబానికి న్యాయం చేయాలని సూసైడ్ నోట్ ద్వారా మృతుడు పోలీసులకు కోరాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.