Viral Video : కార్పొరేట్ ఆఫీసన్నాక నానా రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. టైంకి రావాలి, ఇన్ని గంటలు పని చేయాలనే నిబంధనలతో పాటు కొన్ని ఎక్స్ ట్రా యాక్టివిటీస్ కూడా ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో పని ఒత్తిడిని భరించలేక లైఫ్ ను ఎండ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు కారణం మేనేజ్మెంట్ తీవ్రమైన ప్రెజర్ పెట్టడం, ఎక్కువ పని ఇవ్వడం లాంటివి ఉండొచ్చు. అదే తరహాలో మీరు టాక్సిక్ వర్క్‌ప్లేస్‌ల గురించి వింటుంటారు లేదా చదివి ఉంటారు. కానీ బాస్‌లు నడుస్తున్నప్పుడు నేలపై పడుకోవడం అనే చిత్రమైన పరిస్థితి గురించి ఎప్పుడైనా విన్నారా.. అసలు అలాంటి కల్చర్ ను మీరు సమర్థిస్తారా? చైనాలోని ఒక కంపెనీ ఈ విచిత్రమైన వర్క్ కల్చర్ ను అనుసరిస్తోంది. ఇదిప్పుడు ఇంటర్నెట్ యూజర్స్ ను బాగా ఆకర్షిస్తోంది. ఇక్కడ ఉద్యోగులు తమ యజమానిని గౌరవించేందుకు నేలపై పడుకుంటారు.
ఇది వినడానికి కొత్తగా, వింతగా అనిపిస్తోంది కదా.. మెయిన్‌ల్యాండ్ చైనాలోని గ్వాంగ్‌జౌలోని ఒక కంపెనీ తన సిబ్బందిని కార్యాలయంలో కొన్ని అసాధారణ పద్ధతులకు కట్టుబడి ఉండమని కోరింది. సాధారణంగా ఆఫీస్ లో చాలా మంది ఉద్యోగులు తమ బాస్ ను "హలో" లేదా "గుడ్ మార్నింగ్" అని పలకరిస్తూ ఉంటారు. అయితే 'క్విమింగ్' అనే సంస్థ తమ పై అధికారిని స్వాగతించడానికి నేలపై పడుకోమని ప్రజలను కోరింది.
కంపెనీ విచిత్రమైన ఆచారం
ఆఫీస్ లో బాస్‌ను స్వాగతించడానికి ఉద్యోగులు నేలపై పడుకోవడమే కాకుండా బాస్, కంపెనీని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. వారు తమ జీవితంలో మిగతా వాటి కంటే పనికే విలువ ఇవ్వాలని, ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు."క్విమింగ్ బ్రాంచ్ బాస్ హువాంగ్‌కు స్వాగతం పలుకుతుంది. క్విమింగ్ బ్రాంచ్ కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. అందులో ఎప్పటికీ విఫలం కాము" అని వారు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి, సంస్థ ఆచారాలను అనుసరించడం ఈ వీడియోలో చూడొచ్చు.
సోషల్ మీడియా యూజర్ల స్పందన
ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగానే వైరల్ అయింది. దీనికి వీబీలో 8మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ కల్చర్ ను విమర్శించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వర్క్‌ప్లేస్ ఆచారంలో పాల్గొన్న ఉద్యోగుల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా, ఒక కంపెనీ ప్రతినిధి అక్కడ అలాంటి పద్ధతులు లేవన్నారు. ఈ ఘటనను ఖండించారు. ఇది 2020లోనే కార్యకలాపాలు నిలిపివేసిందని, కంపెనీ రద్దు ప్రక్రియలో ఉందని తెలిపారు.
మరో విచిత్రమైన సందర్భంలో, 2020లో ఒక కంపెనీ ఉద్యోగి తన వర్క్ లో ఫెయిల్ అవడంతో మేనేజ్మెంట్ వారిని మిరపకాయలు తినమని కంపెనీ ఆదేశించినట్టు సమాచారం. దీని వల్ల ఇద్దరు మహిళా సిబ్బంది ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఇది చైనీస్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఆచారం కానప్పటికీ, ఈ ఆచారం ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంకో కంపెనీ ఫిట్‌నెస్ కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతిరోజూ 1,80,000 అడుగులు నడవాలి. టార్గెట్స్ రీచ్ కావడంలో విఫలమైన వారిపై జరిమానాలు విధించారు.
Also Read : Strange Punishment: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం - 20 నిమిషాలు నిలబడాలని సీఈవో పనిష్మెంట్