ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు మరింత గ్లామర్‌ తోడవ్వనుంది!  లీగులో సినిమా తారల ప్రభావం పెరగనుంది. బీసీసీఐ విక్రయించబోతున్న రెండు ఫ్రాంచైజీల్లో ఒక దానిని సొంతం చేసుకొనేందుకు బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె సిద్ధమయ్యారని తెలిసింది. బహుశా వారు 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' క్లబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటారని సమాచారం.


ఐపీఎల్‌లో ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలను సినిమా తారలు సొంతం చేసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను జుహీ చావ్లా, షారుఖ్‌ కలిసి కొనుగోలు చేశారు. పంజాబ్‌ కింగ్స్‌లో ప్రీతీ జింతాకు వాటా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌లో శిల్పాశెట్టి కుటుంబానికి భాగస్వామ్యం ఉండేది. ఇక దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌కు క్రీడలతో అనుబంధం ఉంది.


దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకొణె భారత బ్యాడ్మింటన్‌లో ఒక సంచలనం. ఆయన ఎన్నో బ్యాడ్మింటన్‌ సిరీసులు గెలిచారు. ఆల్‌ ఇంగ్లాండ్‌లోనూ పతకం సాధించి రికార్డులు సృష్టించారు. ఇక రణ్‌వీర్‌ సింగ్‌కు ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌తో సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎన్‌బీఏ లీగుకు అతడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.


ఐపీఎల్‌ ఐటీటీ పత్రాల కొనుగోలు సమయం ముగిసింది. అర్హతలు ఉన్న వారిని బీసీసీఐ ఎంపిక చేయనుంది. వారితోనే వేలం నిర్వహించనుంది. అయితే దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాతి రోజే (అక్టోబర్‌ 25) ఫ్రాంచైజీ విజేతలను ప్రకటించనున్నారు.


పోటీలో ప్రముఖులే ఉండటంతో బీసీసీఐకి ఎక్కువ డబ్బులు వస్తాయని అంచనా వేస్తున్నారు. సంజీవ్‌ గోయెంకా, గ్లేజర్‌ ఫ్యామిలీ (మాంచెస్టర్‌  క్లబ్‌), అదానీ గ్రూప్‌, నవీన్‌ జిందాల్‌, టొరెంట్‌ ఫార్మా, రోనీ స్క్రూవాలా, అరబిందో ఫార్మా, కొటక్‌ గ్రూప్‌, సీవీసీ పార్ట్‌నర్స్‌, సింగపూర్‌కు చెందిన పీఈ ఫర్మ్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌, ఐటీడబ్ల్యూ, గ్రూప్‌ ఎం, దీపికా-రణ్‌వీర్‌ పోటీలో ఉన్నారు. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.3500-4000 కోట్ల వరకు బీసీసీఐ ఆర్జించనుంది.


Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: ఐపీఎల్‌ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఆసక్తి!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి