RCB vs PBKS LIVE Updates: ప్లేఆఫ్స్‌కు కోహ్లీసేన: 20 ఓవర్లకు పంజాబ్‌ 158-6

ఐపీఎల్‌-2021లో తమ భవితవ్యం తేల్చే పోరుకు పంజాబ్‌ కింగ్స్‌ సిద్ధమైంది. ఆదివారం షార్జా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. కోహ్లీసేన మూడో స్థానంలో ఉన్నా ఈ మ్యాచులో గెలుపు ఆ జట్టుకూ కీలకమే.

ABP Desam Last Updated: 03 Oct 2021 07:18 PM
ప్లేఆఫ్స్‌కు కోహ్లీసేన: 20 ఓవర్లకు పంజాబ్‌ 158-6

ఆఖరి ఓవర్లో హర్షల్‌ అద్భుతం చేశాడు. 19 పరుగుల్ని రక్షించాడు. కేవలం 12 పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి షారుక్‌ (16) రనౌట్‌ అయ్యాడు. ఆఖర్లో హెన్రిక్స్‌ (12) ఓ సిక్సర్‌ బాదాడు. పంజాబ్‌ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

19 ఓవర్లకు పంజాబ్‌ 146-5


సిరాజ్‌ కేవలం 8 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని షారుక్ (16) బౌండరీకి పంపించాడు. హెన్రిక్స్‌ (3) ఆచితూచి ఆడుతున్నాడు.

18 ఓవర్లకు పంజాబ్‌ 138-5

హర్షల్‌ బాగా బౌలింగ్‌ చేశాడు. పది పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని షారుక్‌ (11) 102 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. హెన్రిక్స్‌ (1) అతడికి తోడుగా ఉన్నాడు. 12 బంతుల్లో 27 పరుగులు కావాలి.

మార్‌క్రమ్‌ ఔట్‌; 17 ఓవర్లకు పంజాబ్‌ 128-5

గార్టన్‌ ఏడు పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. 16.5వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి మార్‌క్రమ్‌ (20) ఔటయ్యాడు. క్రీజులో షారుక్‌, హెన్రిక్స్‌ ఉన్నారు.

వెంటవెంటనే మయాంక్‌, సర్ఫరాజ్‌ ఔట్‌: 16 ఓవర్లకు పంజాబ్‌ 121-4

చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కీలకమైన మయాంక్‌ను ఔట్‌ చేశాడు. మరికాసేపటికే క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. ఎనిమిది పరుగులు ఇచ్చాడు. మార్‌క్రమ్‌ (15) సిక్సర్‌ బాదాడు. షారుక్‌ క్రీజులోకి వచ్చాడు.

మయాంక్‌ (57; 42balls 6x4, 2x6) ఔట్

చాహల్‌ వేసిన 15.2వ బంతికి మయాంక్‌ (57; 42balls 6x4, 2x6) ఔటయ్యాడు. బ్యాట్‌ అంచుకు తాకిన బంతి స్లిప్‌లో సిరాజ్‌కు చిక్కింది.

15 ఓవర్లకు పంజాబ్‌ 113-2

సిరాజ్‌ పదకొండు పరుగులు ఇచ్చాడు. మయాంక్‌ (57), మార్‌క్రమ్‌ (7) చెరో బౌండరీ బాదడంతో కాస్త ఒత్తిడి తగ్గింది.

14 ఓవర్లకు పంజాబ్‌ 102-2

గార్టన్‌ వేగం తగ్గించి బంతులు వేశాడు. రెండు పరుగులే ఇచ్చాడు. మయాంక్‌ (52), మార్‌క్రమ్ (1) ఆచితూచి ఆడారు. పంజాబ్‌ విజయానికి 36 బంతుల్లో 63 పరుగులు కావాలి.

పూరన్‌ ఔట్‌: 13 ఓవర్లకు పంజాబ్‌ 100-2

చాహల్‌ వైడ్లు వేసి విసిగించాడు. ఐదో బంతికి నికోల్‌ పూరన్‌ (3)ను ఔట్‌ చేశాడు. కేవలం 6 పరుగులే ఇచ్చాడు. మయాంక్ (51) అర్ధశతకం చేసుకున్నాడు. మార్‌క్రమ్‌ (0) క్రీజులోకి వచ్చాడు.

12 ఓవర్లకు పంజాబ్‌ 94-1

హర్షల్‌ రెండు పరుగులే ఇచ్చాడు. మయాంక్‌ (48) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. పూరన్‌ (2) అతడికి తోడుగా ఉన్నాడు.

రాహుల్‌ ఔట్‌: 11 ఓవర్లకు పంజాబ్‌ 92-1

షాబాజ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఈ ఓవర్లో వికెట్‌ తీసి 11 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి కీలకమైన కేఎల్‌ రాహుల్‌ (39; 35balls 1x4, 2x6)ను ఔట్‌ చేశాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో బంతి బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లో ఫీల్డర్‌ హర్షల్‌కు దొరికింది. మయాంక్‌ (47) మూడో బంతిని సూపర్ సిక్సర్‌గా మలిచాడు. పూరన్ (1) క్రీజులోకి వచ్చాడు. 

10 ఓవర్లకు పంజాబ్‌ 81-0

చాహల్‌ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మయాంక్‌ (38) రెండు చక్కని బౌండరీలు బాదాడు. ఒత్తిడి తగ్గించాడు. రాహుల్‌ (38) అతడికి సహకారం అందిస్తున్నాడు.

9 ఓవర్లకు పంజాబ్‌ 72-0

షాబాజ్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (37), మయాంక్‌ (30) షాట్లు ఆడలేదు. సమయోచితంగా పరుగులు చేస్తున్నారు.

8 ఓవర్లకు పంజాబ్‌ 67-0

డాన్‌ క్రిస్టియన్‌ 11 పరుగులు ఇచ్చాడు.  మయాంక్‌ (29) రెండు చక్కని బౌండరీలు బాదాడు. రాహుల్‌ (33) నిలకడగా ఆడుతున్నాడు.

7 ఓవర్లకు పంజాబ్‌ 56-0

చాహల్‌ 7 పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (31), మయాంక్‌ (20) ఆచితూచి ఆడారు.

6 ఓవర్లకు పంజాబ్‌ 49-0

హర్షల్‌ వచ్చాడు. మూడు పరుగులే ఇచ్చాడు. రాహుల్‌ (26), మయాంక్‌ (19) ఆచితూచి ఆడారు.

5 ఓవర్లకు పంజాబ్‌ 46-0

షాబాజ్‌ 13 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని రాహుల్‌ (24) సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతిని మయాంక్‌ (18) బౌండరీకి పంపించాడు.

4 ఓవర్లకు పంజాబ్‌ 33-0

గార్టన్‌ ఈ ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని మయాంక్‌ (13) సిక్సర్‌గా మలిచాడు. రాహుల్‌ (16) అతడికి సహకారం అందిస్తున్నాడు.

3 ఓవర్లకు పంజాబ్‌ 19-0

సిరాజ్‌ 12 పరుగులు ఇచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ (14) మొదటి బంతిని బౌండరీకి పంపించాడు. నాలుగో బంతిని 101 మీటర్ల సిక్సర్‌గా బాదేశాడు. ఆ తర్వాత బంతికి ఎల్బీగా ఇచ్చినా.. రివ్యూ కోరి నాటౌట్‌గా తేలాడు. మయాంక్‌ (3) అతడికి తోడుగా ఉన్నాడు.

2 ఓవర్లకు పంజాబ్‌ 7-0

జార్జ్‌ గార్టన్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. రాహుల్‌ (3), మయాంక్‌ (2) నిలకడగా ఆడుతున్నారు. వారు షాట్లు ఆడకుండా బెంగళూరు బౌలర్లు నెమ్మది బంతులు వేస్తున్నారు.

1 ఓవర్‌కు పంజాబ్‌3-0: లక్ష్యం 165

పంజాబ్‌ ఛేదన ఆరంభించింది. తొలి ఓవర్‌ను సిరాజ్‌ వేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రాహుల్‌ (1), మయాంక్‌ (1) నిలకడగా ఆడారు.

20 ఓవర్లకు బెంగళూరు 164-7

షమి ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రెండో బంతికి మాక్సీ ఔటయ్యాడు. మూడో బంతిని సిక్సర్‌ బాదిన షాబాజ్‌ (8) నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే జార్జ్ గార్టన్‌(0) బౌల్డ్‌ అయ్యాడు. హర్షల్‌ (1), భరత్‌ (0) అజేయంగా నిలిచారు.

మాక్సీ ఔట్‌

షమి వేసిన 19.2వ బంతికి మాక్సీ (57: 33balls 3x4, 4x6) ఔటయ్యాడు. సర్ఫరాజ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

మాక్సీ 50;  19 ఓవర్లకు బెంగళూరు 156-3

అర్షదీప్‌ పూర్తిగా ఒత్తిడి చెందుతున్నాడు. ఈ ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని ఏబీడీ సిక్సర్‌ బాదగా ఆఖరి బంతిని మాక్సీ (57) బౌండరీకి పంపించాడు. షాబాజ్‌ (1) క్రీజులో ఉన్నాడు.

ఏబీడీ రనౌట్‌

అర్షదీప్‌ వేసిన 18.2 బంతికి ఏబీడి (23) రనౌట్‌ అయ్యాడు. వేగంగా సింగిల్‌ తీస్తుండగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతంగా త్రో విసిరాడు. 

మాక్సీ 50;  18 ఓవర్లకు బెంగళూరు 140-3

బిష్ణోయ్‌ 8 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని మాక్సీ (50) బౌండరీ బాదేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఏబీడీ (17) సహకారం అందిస్తున్నాడు.

17 ఓవర్లకు బెంగళూరు 132-3

షమి తన అనుభవం ఉపయోగించడం లేదు. నెమ్మది పిచ్‌పై వేగంగా బంతులేస్తున్నాడు. ఈ ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. మాక్సీ (43) ఒక బౌండరీ బాదేశాడు. ఆఖరి రెండు బంతుల్ని ఏబీడీ (17) వరుసగా 4,6 కొట్టాడు.

16 ఓవర్లకు బెంగళూరు 115-3

హెన్రిక్స్‌ బౌలింగ్‌ స్పెల్‌ ముగిసింది. 4 ఓవర్లు వేసి 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు. మాక్సీ (37), ఏబీడీ (6) షాట్లకు ప్రయత్నిస్తున్నారు.

15 ఓవర్లకు బెంగళూరు 109-3

రవి బిష్ణోయ్‌ 16 పరుగులు ఇచ్చాడు. మాక్సీ (34) వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్సర్లు దంచాడు. ఏబీడీ (4) అతడికి సహకారం అందిస్తున్నాడు.

14 ఓవర్లకు బెంగళూరు 93-3

హెన్రిక్స్‌ తెలివిగా బౌలింగ్‌ చేస్తున్నాడు. నాలుగు పరుగులు ఇచ్చాడు. మాక్సీ (19), ఏబీడీ (3) నిలకడగా ఆడారు.

13 ఓవర్లకు బెంగళూరు 89-3

హర్‌ప్రీత్‌ 16 పరుగులు ఇచ్చాడు. మాక్స్‌వెల్‌ (18) రెండు భారీ సిక్సర్లు బాదేశాడు. ఏబీడీ (1) ఖాతా తెరిచాడు.

హెన్రిక్స్‌కు 3 వికెట్లు: 12 ఓవర్లకు బెంగళూరు 73-3

హెన్రిక్స్‌ మళ్లీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం రెండు పరుగులు ఇచ్చి కీలకమైన దేవదత్‌ పడిక్కల్‌ (40: 38balls 4x4, 2x6)ను ఔట్‌ చేశాడు. రాహుల్‌ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. మాక్సీ (3), డివిలియర్స్‌ (0) ఆచితూచి ఆడుతున్నారు.

11 ఓవర్లకు బెంగళూరు 71-2

హర్‌ప్రీత్‌ తన బౌలింగ్‌తో ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. పడిక్కల్‌ (39), మాక్సీ  (2) నిలకడగా ఆడుతున్నారు.

వరుస బంతుల్లో కోహ్లీ, క్రిస్టియన్‌ ఔట్‌: 10 ఓవర్లకు బెంగళూరు 69-2

మోజెస్‌ హెన్రిక్స్‌ అద్భుతం చేశాడు. బంతి అందుకున్న తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతికి విరాట్‌ కోహ్లీ (25; 24balls 2x4, 1x6) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే క్రీజులోకి వచ్చిన డాన్‌ క్రిస్టియన్‌ (0) సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం మాక్స్‌వెల్‌ (1), పడిక్కల్‌ (38) క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లకు బెంగళూరు 67-0

హర్‌ప్రీత్‌ ఏడు పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని స్లాగ్‌స్వీప్‌తో కోహ్లీ (25) సూపర్‌ సిక్స్‌ కొట్టాడు. పడిక్కల్‌ (37) నిలకడగా ఆడుతున్నాడు.

8 ఓవర్లకు బెంగళూరు 60-0

రవి బిష్ణోయ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పడిక్కల్‌ (37) గూగ్లీలకు ఇబ్బంది పడ్డాడు. ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. కోహ్లీ (19) నిలకడగా ఆడుతున్నాడు.

7 ఓవర్లకు బెంగళూరు 57-0

హర్‌ప్రీత్‌ తెలివిగా బౌలింగ్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ (19), పడిక్కల్‌ (35) ఆచితూచి ఆడారు.

6 ఓవర్లకు బెంగళూరు 55-0

అర్షదీప్‌ ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ఈ ఓవర్లోనూ 13 పరుగులు ఇచ్చాడు. పడిక్కల్‌ (34) మొదటి బంతిని స్టాండ్స్‌లో పెట్టాడు. ఐదో బంతికి ఫైన్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు. కోహ్లీ (18)  అతడికి అండగా ఉన్నాడు.

5 ఓవర్లకు బెంగళూరు 42-0

షమి ఎనిమిది పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని కోహ్లీ (17) చక్కని ఫ్లిక్‌తో బౌండరీకి పంపించాడు. పడిక్కల్‌ (23) నిలకడగా ఆడాడు.

4 ఓవర్లకు బెంగళూరు 34-0

రవి బిష్ణోయ్‌ పది పరుగులు ఇచ్చాడు. మొదటి బంతికి కోహ్లీ (10) స్టంపౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. రాహుల్‌ బంతి అందుకోలేకపోయాడు. రెండో బంతికి పడిక్కల్‌ (22) క్యాచ్ ప్రమాదం తప్పించుకున్నాడు. రాహుల్‌ త్రుటిలో మిస్‌ చేశాడు. ఆ తర్వాత అతడు రెండు చక్కని బౌండరీలు బాదాడు.

3 ఓవర్లకు బెంగళూరు 24-0

అర్షదీప్‌ బౌలింగ్‌ ఆరంభించాడు. అయితే తొలి రెండు బంతులను పడిక్కల్‌ (14) వరుసగా సిక్సర్‌, బౌండరీ బాదేశాడు. కోహ్లీ (9) మరో ఎండ్‌లో ఉన్నాడు.

2 ఓవర్లకు బెంగళూరు 11-0

మహ్మద్‌ షమి బౌలింగ్‌ ఆరంభించాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. కోహ్లీ (9), పడిక్కల్‌ (2) ఆచితూచి ఆడుతున్నారు. షాట్లకు ప్రయత్నించలేదు.

ఒక ఓవర్‌కు బెంగళూరు 5-0

పంజాబ్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌తో బౌలింగ్‌ ఆరంభించింది. అతడు ఐదు పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని కోహ్లీ (5) బౌండరీకి పంపించాడు. దేవదత్‌ పడిక్కల్‌ (0) అతడికి తోడుగా ఉన్నాడు.

Background

ఐపీఎల్‌-2021లో తమ భవితవ్యం తేల్చే పోరుకు పంజాబ్‌ కింగ్స్‌ సిద్ధమైంది. ఆదివారం షార్జా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. కోహ్లీసేన మూడో స్థానంలో ఉన్నా ఈ మ్యాచులో గెలుపు ఆ జట్టుకూ కీలకమే. మరోవైపు రాహుల్‌ బృందం ప్రతి మ్యాచూ గెలవాల్సిన పరిస్థితి.


పంజాబ్‌దే పైచేయి
రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్‌ కింగ్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 27 సార్లు తలపడగా పంజాబ్‌ 15, బెంగళూరు 12 సార్లు గెలిచాయి. చివరి ఐదు మ్యాచుల్లోనూ రాహుల్‌ సేననే మూడుసార్లు గెలిచింది. 2019 తర్వాత ఆర్‌సీబీ వారిపై గెలవనేలేదు. ఈ సీజన్లో బెంగళూరు 11 మ్యాచుల్లో 7 గెలవగా పంజాబ్‌ 12 మ్యాచుల్లో 5 గెలిచింది. ఈ మ్యాచే కాకుండా మిగిలిన రెండింట్లోనూ గెలిస్తే రాహుల్‌ సేన ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.


కీలక సమయాల్లో ఒత్తిడి
గతేడాది నుంచీ పంజాబ్‌ కింగ్స్‌ కీలక సమయాల్లో వెనకబడిపోతోంది. అనవసర ఒత్తిడికి లోనై గెలిచే మ్యాచులనూ ఓడిపోతోంది. వీలైనంత మేరకు ఆ మానసిక ఒత్తిడి తొలగించుకుంటే మంచిది. యుజ్వేంద్ర చాహల్‌పై మయాంక్‌ అగర్వాల్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌ను చితకబాదేస్తాడు. కానీ ఔటయ్యే ప్రమాదమూ ఎక్కువే ఉంది. రాహుల్‌ తన ఫామ్‌ను కొనసాగించాలి. క్రిస్‌గేల్‌ లేని లోటును మార్‌క్రమ్‌ ఇంకా పూడ్చలేదు. పూరన్‌ నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో ఒక మ్యాచులో మురిపించిన దీపక్‌ హుడా మళ్లీ అలాంటి ఇన్నింగ్స్‌ ఆడలేదు. షారుక్‌ ఖాన్‌ రాగానే పరుగులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. అర్షదీప్‌, షమి, రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో కీలకం అవుతారు. సీజన్‌ తొలి మ్యాచులో కోహ్లీ, ఏబీడీ, మాక్సీని హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఔట్‌ చేశాడు. బహుశా అతడికి మళ్లీ అవకాశం దొరకొచ్చు.


ఏబీ ఒక్కడే బాకీ 
మిడిలార్డర్‌ బలోపేతం కావడంతో బెంగళూరుకు కాస్త ధీమాగా కనిపిస్తోంది. విరాట్‌కోహ్లీ కసిగానే ఆడుతున్నాడు. దేవదత్‌ పడిక్కల్‌ అతడితో కలిసి చక్కని ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. వీరిద్దరూ ఔటైనా.. ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్‌ సమయోచిత ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. ఆపై మాక్సీ తన స్విచ్‌హిట్‌ షాట్లతో దుమ్మురేపుతున్నాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఏబీ ఇప్పటి వరకు తన స్థాయి ప్రదర్శన చేయకపోవడమే బెంగళూరును వేధిస్తోంది. యూజీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వికెట్లు తీస్తున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ సైతం డెత్‌లో వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. హర్షల్‌ పటేల్‌ అత్యధిక వికెట్ల రికార్డు వేటలో ఉన్నాడు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.