Dil Raju condemned the comments made by KTR on the meeting with Revanth: సినీ ఇండస్ట్రీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు రహస్యంగా జరిపినవి కావని చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. చిత్రపరిశ్రమతో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి దాపరికాల్లేకుండా జరిగిన ఈ సమావేశంలో పూర్తి స్నేహభావంతో జరిగిందనద్నారు. ఈ సమావేశం విషయంలో చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా సహకారం అందచేయాలని సీఎం కోరారన్నారు.                                                   


Also Read:  కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !                   


హైదరాబాద్‌ను గ్లోబర్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలన్న సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర సీమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించామన్నారు. అనవసర వివాదాల్లోకి..రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగవద్దని కేటీఆర్‌కు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందర్నీ కోరుతున్నామన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల  సహకారం , ప్రజల ప్రోత్సాహం ఎప్పటికి ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.  







సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నారన్న కేటీఆర్ 


సోమవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులోత మాట్లాడినప్పుడు  ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక.. ప్రజల నుంచి విమర్శలు వస్తాయనే భయంతో డైవర్ట్ చేసే క్రమంలో అల్లు అర్జున్‌ ను టార్గెట్ చేశారని  ఆరోపించారు.  రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.   సినిమా వాళ్లపైన పడి అటెన్షన్-డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని విమర్శించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్‌గా ఉన్నాడని మండిపడ్డారు.  గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలని డిమాండ్ చేశారు. వాళ్లకు కూడా కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని  పోరాడతామన్నారు.                                                    



Also Read: KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?