అంతర్జాతీయ మ్యాచుల్లో పరుగుల వరద పారించే రోహిత్‌శర్మ ఐపీఎల్‌లో మాత్రం అలా ఆడకపోవడం తనను విస్మయపరుస్తోందని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఉన్న బ్యాటింగ్‌ డెప్త్‌కు అతడు మరింత దూకుడుగా ఆడాల్సిందని సూచించాడు. ఐపీఎల్‌లో అతడు ఒక్కసారీ 600+ పరుగులు చేయలేదని వెల్లడించాడు. 2017 నుంచి 400 మించి పరుగులు చేయలేదని పేర్కొన్నాడు.


Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!


'ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ పరుగుల సునామీని ఎందుకు సృష్టించడం లేదో నాకైతే అర్థంకావడం లేదు. ఈ విషయంలో అతడికి అండగా ఉండలేను. నిజానికి హిట్‌మ్యాన్‌ ప్రపంచస్థాయి ఆటగాడు. అతడు తొలిసారి అంతర్జాతీయ మ్యాచులో విజృంభించినప్పుడు స్ఫూర్తి పొందాను. భారత క్రికెట్లో అతడో గొప్ప ప్రతిభావంతుడని నేనిప్పటికీ చెప్పగలను' గౌతీ అన్నాడు.


Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్‌ రాహుల్‌


'రోహిత్‌ అంతర్జాతీయ వేదికలపై నిరూపించుకున్నాడు. ముంబయి జెర్సీలో మాత్రం స్థాయికి తగ్గట్టు ఆడకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లా అతడు 600+ పరుగులు చేయడం చూడలేదు. ప్రతిభావంతుడైన హిట్‌మ్యాన్‌ తన స్థాయి ప్రభావం ఐపీఎల్‌లో చూపించలేదు' అని గంభీర్‌ పేర్కొన్నాడు.


Also Read: సన్‌రైజర్స్‌ నవ్వింది! థ్రిల్లర్‌ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది


'రోహిత్‌ ఆడుతున్న విధానం కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ప్రత్యేకించి ఐపీఎల్‌లో. అంతర్జాతీయ క్రికెట్లో విరుచుకుపడే రోహిత్‌ ఐపీఎల్‌లో మాత్రం నత్తనడకన ఎందుకు బ్యాటింగ్‌ చేస్తున్నాడో తెలియదు. ముంబయికి ఉన్న బ్యాటింగ్‌ డెప్తుకు అతడు మరింత దూకుడుగా ఆడాలి' అని గౌతీ వెల్లడించాడు.


Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?


ఇండియన్‌ ప్రీమియర్ లీగులో ఇప్పటి వరకు 212 మ్యాచులాడిన రోహిత్‌ 31.24 సగటుతో 5593 పరుగులు చేశాడు. 2013లో 538 చేయడమే ఒక సీజన్లో టాప్‌. ఈ సీజన్లో 12 మ్యాచులాడిన హిట్‌మ్యాన్‌ 30 సగటుతో 363 పరుగులు సాధించాడు.


Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి