'ఎంఎస్‌ ధోనీ.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ'.. ఈ సినిమా అభిమానులను ఉర్రూతలూగించింది. ఎంతోమందిని ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది! మహీ సినిమానే ఇలావుంటే నిజంగా అతడే నటించడం మొదలుపెడితే ఇంకెలా ఉంటుందో! మరి మున్ముందు ఎంఎస్‌ ధోనీ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడా?


అంటే.. లేదనే అంటున్నాడు ఎంఎస్‌ ధోనీ. తనకు క్రికెట్‌ అంటేనే ఇష్టమని అంటున్నాడు. క్రికెట్లోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. సినిమాల్లో నటించడం అంత తేలికైన విషయమేం కాదని వెల్లడించాడు. అందుకు ప్రొఫెషనల్సే సరైనవాళ్లని తెలిపాడు. తన వరకు ప్రకటనల్లో మాత్రం నటిస్తానని పేర్కొన్నాడు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడీ విషయం చెప్పాడు.


Also Read: రాజస్తాన్‌ను చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్!


'బాలీవుడ్‌కు నాకూ సంబంధం లేదు. ప్రకటనల వరకు ఇబ్బంది లేకుండా నటిస్తాను. ఇక సినిమాల విషయానికి వస్తే అదెంతో కష్టమైన పని. నటించడం అంత సులువు కాదు. దానిని ప్రొఫెషనల్‌ నటులకే వదిలేస్తే మంచిది. నేను క్రికెట్‌కే అంకితమవుతా. నటన పరంగా చెప్పాలంటే ప్రకటనల వరకు పరిమితం అవుతా. అంతకుమించి చేయలేను' అని ధోనీ చెప్పాడు.


Also Read: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు శామ్ కరన్ దూరం.. కారణం ఏంటంటే?


ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఎంఎస్‌ ధోనీ అద్భుతంగా నడిపిస్తున్నాడు. తనకు ఉన్న వనరులనే చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో జట్టును రూపొందించి బరిలోకి దించుతున్నాడు. తనదైన వ్యూహాలతో విజయాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగతంగా మాత్రం ధోనీ కాస్త వెనుకబడ్డాడు. మునుపటి మెరుపులేమీ లేవు. అయితే ఈ ఏడాది టైటిల్‌ అందుకోవాలని ధోనీసేన పట్టుదలతో ఉంది.


Also Read: భారత్‌ x పాక్‌.. గంటల్లోనే టికెట్లన్నీ కల్లాస్‌..! వేలల్లో పలికిన ధర!


 మరోవైపు వచ్చే సీజన్లోనూ ధోనీని రీటెయిన్‌ చేసుకుంటామని చెన్నై సూపర్‌కింగ్స్‌ చెబుతోంది. భారత్‌లో చెన్నైలో అతడికి ఘనంగా వీడ్కోలు పలుకుతామని అంటోంది. అలాగే రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌ను తీసుకుంటామని సూచనలు చేసింది. ఈ సీజన్లో ధోనీసేన ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి