టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. కీలక ఆల్ రౌండర్ శామ్ కరన్ గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు. వెన్నెముక కింది భాగంలో గాయం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. శామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్ జట్టుకు ఎంపికయ్యాడు. రీస్ టాప్లేని ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.
ప్రస్తుతం యూఏఈలో ఉన్న శామ్ కరన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతను చెన్నై, రాజస్తాన్ మ్యాచ్ కూడా ఆడలేదు. శామ్ కరన్ స్థానంలో డ్వేన్ బ్రేవోను ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు.
గాయంతో ఉన్న తనకు స్కానింగ్ చేశారని, ఇందులో ఫలితాలు తెలిసాయని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. త్వరలో అతను యూకేకు వస్తాడని, రాబోయే రోజుల్లో తనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి.. పూర్తి నివేదికను ఈసీబీ మెడికల్ టీంకు అందిస్తామని ఇందులో తెలిపింది.
టామ్ కరన్ కూడా ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. తను రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ టీంలో ఉన్న కొందరు సభ్యులు యూఏఈలో ఆడుతున్నారు. ఐపీఎల్‌కు దూరమైన సభ్యులు ఇప్పటికే మస్కట్‌కు వచ్చారు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నారు. వారి బేస్‌ను దుబాయ్‌కి మార్చేలోపు వీరు ట్రైనింగ్ క్యాంపులో 10 రోజులు గడపనున్నారు.
టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు క్వాలిఫయర్స్ జరగనున్నాయి. అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు సూపర్ 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 10, 11వ తేదీల్లో సెమీ ఫైనల్స్, 14వ తేదీన ఫైనల్ జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్‌తో ఆడనుంది.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి