టీమ్‌ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన దుమ్మురేపింది! గులాబి టెస్టులో శతకం చేసిన భారత రెండో క్రికెటర్, తొలి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన నిలిచింది. తన బ్యాటింగ్‌కు తిరుగులేదని చాటిచెప్పింది. ఆసీస్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఆమె ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే!
Also Read: జోరు మీదున్న కోల్‌కతా.. ఒత్తిడిలో పంజాబ్.. మ్యాచ్ నేడే!
మైమరిపించిన మంధాన
తొలిరోజు 80 పరుగులతో నిలిచిన స్మతి మంధాన (127; 216b 22x4, 1x4) రెండో రోజు తనదైన రీతిలో ఆడింది. పూనమ్ రౌత్ (36; 165b 2x4)తో రెండో వికెట్‌కు 102 పరుగులు విలువైన భాగస్వామ్యం అందించింది. ఈ క్రమంలోనే ఆమె గులాబి బంతితో తొలి శతకం బాదేసింది. ఇందుకు 170 బంతుల్నే తీసుకుంది. ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్‌నర్, సోఫీ మోలినెక్స్ వంటి బౌలర్లను ఎదుర్కొంది. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే అందివచ్చిన బంతుల్ని బౌండరీకి బాదేసింది. భారీ స్కోరు వైపు పరుగులు తీస్తున్న ఆమెను జట్టు స్కోరు 195 వద్ద గార్డనర్ ఔట్ చేసింది. దాంతో రెండో రోజు డిన్నర్ సమయానికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ (15), యస్తికా భాటియా (2) క్రీజులో ఉన్నారు.
Also watch: కొహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! సయోధ్య కోసమే ధోనీకి మెంటార్‌షిప్?
పూనమ్ క్రీడాస్ఫూర్తికి ఫిదా
ఈ మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్ పూనమ్ రౌత్ (36; 165b 2x4) ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. స్మృతి మంధానకు ఆమె తోడుగా నిలిచింది. చక్కని సహకారం అందించింది. అర్ధశతకం వైపు పరుగులు తీస్తున్న ఆమెను 80.4వ బంతికి మోలినెక్స్ ఔట్ చేసింది. నిజానికి ఆమె ఆడిన బంతి బ్యాట్ అంచుకు తగిలి కీపర్ చేతుల్లో పడింది. అయితే బ్యాటుకు బంతి తాకినట్టే అనిపించలేదు. అంపైర్ ఔటివ్వనప్పటికీ పూనమ్ రౌత్ క్రీజును వదిలి వెళ్లిపోయింది. దాంతో ఆమె క్రీడాస్ఫూర్తికి అంతా ఫిదా అయ్యారు. ఆమెను మెచ్చుకుంటున్నారు.
Also Read: అబ్బో.. ఐపీఎల్‌ను తెగ చూసేస్తున్నారుగా! 40 కోట్లు దాటనున్న వీక్షకులు
ఇద్దరూ ఇద్దరే!
ఇప్పటి వరకు భారత్ తరఫున గులాబి టెస్టుల్లో ఇద్దరు మాత్రమే సెంచరీలు బాదేశారు. పురుషుల క్రికెట్లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టగా మహిళల క్రికెట్లో స్మృతి మంధాన ఆసీస్ చేసింది. దాంతో ఆమెను అతడితో పోలుస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. 18వ నంబర్ జెర్సీ వేసుకున్న వాళ్ల ఆటతీరు ఇలాగే ఉంటుందని అంటున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి