ఐపీఎల్‌లో ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో ఇది 45వ మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. యూఏఈలో మ్యాచ్‌లు మొదలయ్యాక కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన అద్భుతంగా మారింది.


ఇక పంజాబ్ విషయానికి వస్తే.. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్‌ వైపు మరో అడుగు వేయాలనేది కోల్‌కతా లక్ష్యం. యూఏఈలో ఇప్పటి వరకు కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడు విజయాలు సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫాం జట్టును ఇబ్బంది పెడుతోంది. ఆండ్రీ రసెల్ స్థానంలో టిమ్ సౌతీకి మరో అవకాశం లభించేలా ఉంది.


గత రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం అయ్యారు. ఏమాత్రం అంచనాలు లేని ఎయిడెన్ మార్క్రమ్ బాగా బ్యాటింగ్ చేస్తుండగా.. మిగతా ఆటగాళ్లందరూ ఇబ్బంది పడుతున్నారు. గేల్ ఫాంలో లేకపోవడం వల్ల పంజాబ్ చాలా ఇబ్బంది పడుతోంది. పూరన్ ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పంజాబ్ బౌలర్లు మాత్రం మంచి ఫాంలో ఉన్నారు.


Also Read: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్‌ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్‌


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. కోల్‌కతా 19 మ్యాచ్‌ల్లో నెగ్గి ఫుల్‌గా డామినేట్ చేసింది. పంజాబ్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 


తుదిజట్లు(అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్


పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్


Also Read: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు


Also Read: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి